హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ తెలిపారు. కరీంనగర్ లోని SR డిగ్రీ కాలేజ్ లో కౌంటింగ్ జరుగుతుందన్నారు. రెండు హాల్స్ ఉంటాయి.. 22 రౌండ్స్ లో కౌంటింగ్ జరగనున్నట్టు ఆయన వెల్లడించారు. రేపు ఉదయం 8 గంటలకు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తామని, ముందగా పోస్టల్ ఓట్లు లెక్కించనున్నట్టు ఆయన తెలిపారు. కోవిడ్ నిబంధనల ప్రకారం కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశామన్నారు. దీనికి సంబంధించి…
హుజురాబాద్‌లో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌గోయల్ మీడియాకు తెలిపారు. అక్కడక్కడ చెదురు ముదురు ఘటనలు తప్ప ఏం జరగలేదన్నారు. ప్రస్తుతానికి 86.40శాతం పోలింగ్ నమోదు అయిందన్నారు. 220,223,224,237 పోలింగ్ బూతులో ఇంకా పోలింగ్ శాతం లెక్కించలేదు. సాయంత్రం 7 గంటల వరకు చాలా చోట్ల పోలింగ్ ముగిసింది. 224,237 పోలింగ్ కేంద్రాల్లో ఇంకా ఓటర్లు ఉన్నారు. పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు చాలా బాగా చేశారు.…
హుజురాబాద్ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలకు 306 పోలింగ్ స్టేషన్‌లను ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ఎన్నికల నిబంధనలు ఎవ్వరూ ఉల్లఘించిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటివరకు 88 ఫిర్యాదులు అందినట్లు ఆయన పేర్కొన్నారు. వీటితో పాటు డబ్బు, మద్యం పంపిణీ ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతామని.. నిజాలు తేలితే ఎన్నికల అనంతరం కూడా…
హుజురాబాద్ ఉప ఎన్నిక ఏర్పాట్లపై తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ మాట్లాడారు. రేపటి ఉప ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాం అని చెప్పిన ఆయన ఈవీఎంలు, వీవీ ప్యాట్ లు పోలింగ్ కేంద్రాలకు చేరాయి. బ్లైండ్ ఓటర్ల కోసం బ్రెయిలీ ఈవీఎంలు సిద్ధం చేశాం. 32 మంది మైక్రో అబెజర్వేషన్లు ఉన్నారు. 3868 మంది పోలీసు బలగాలు బందోబస్తు చేస్తున్నాం. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేసాం. కోవిడ్ నిబంధనలతో…
హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్‌కు లేఖరాశారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల… హుజురాబాద్ ఉప ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్‌ను తొలగించాలి, స్థానిక పోలీస్ కమిషన్‌పై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర వర్గాల వారు నామినేషన్లు వేయకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని.. నామినేషన్లకు దరఖాస్తులు కూడా ఇవ్వడం లేదని.. అభ్యర్థి మద్దతుదారులను స్థానిక…
ఎట్టకేలకు హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.. ప్రభుత్వ సూచనలతో గతంలో వాయిదా పడినా.. ఇప్పుడు షెడ్యూల్ వచ్చేసింది.. ఈ నేపథ్యంలో.. కీలక ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్.. కేంద్ర ఎన్నికల సంఘం హుజురాబాద్ ఉప ఎన్నికలకి షెడ్యూల్ ఇచ్చింది.. అక్టోబర్ 30న ఎన్నికలు ఉంటాయి. నవంబర్ 2 ఫలితాలు వెలువడతాయని తెలిపారు.. కోవిడ్ కేసులు ఇంకా వెలుగు చూస్తున్న నేపథ్యంలో.. నిబంధనలు ఏవిధంగా…