శరత్ బాబు, కమల్ హాసన్ కలసి అనేక చిత్రాలలో నటించారు. వాటిలో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన “సాగరసంగమం, స్వాతిముత్యం” చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ రెండు చిత్రాలలో కమల్ హాసన్ అభినయం చూసి మన దేశంలో నటనకు ‘ఆస్కార్ అవార్డ్’ అంటూ వస్తే అది కమల్ తోనే మొదలవుతుంది అంటూ శరత్ బాబు అనేవారు. ఆ మాటను కె.విశ్వనాథ్ సైతం బలపరిచారు. అలా కమల్ కు ఆస్కార్ అంటూ అప్పట్లో సినిమా పత్రికల్లో ఆకర్షణీయమైన కథనాలు ప్రచురితమయ్యాయి.…
గత కొంతకాలంగా హాస్పిటల్ చికిత్స తీసుకుంటున్న ప్రముఖ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. నటుడు శరత్ బాబు జన్మస్థలం శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస. తండ్రి విజయశంకర దీక్షితులు, తల్లి సుశీలాదేవి. మొత్తం పదమూడు మంది సంతానం. ఎనిమిది మంది అన్నదమ్ములు, ఐదుగురు అక్కచెల్లెళ్ళు. జూలై 31, 1951న ఆయన జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు సత్యం బాబు దీక్షితులు. అయతే ముద్దుగా శరత్ బాబును ‘సత్యంబాబు’ అని పిలిచే వారు. పి.యు.సి. ఆముదాల వలసలో పూర్తి…