రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్‌గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్‌గా మారారు. అప్రూవర్‌గా మారిన తర్వాత సెక్షన్ 164 కింద సీబీఐ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.