Rohit Sharma: వాంఖడేలో ‘రోహిత్ శర్మ’ స్టాండ్ ఆవిష్కరణ.. క్రికెట్ దిగ్గజాల సరసన హిట్ మ్యాన్
- వాంఖడేలో 'రోహిత్ శర్మ' స్టాండ్ ఆవిష్కరణ
- క్రికెట్ దిగ్గజాల సరసన హిట్ మ్యాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీం ఇండియాకు 2024 టీ20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ కృషికి ఫలితం దక్కింది. వాంఖడే స్టేడియంలోని ఒక స్టాండ్ కు హిట్ మ్యాన్ పేరు పెట్టారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పేరు మీద ఉన్న స్టాండ్‌ను శుక్రవారం ప్రారంభించారు. మే 16వ తేదీ శుక్రవారం నాడు, రోహిత్ శర్మ తల్లిదండ్రులు రిబ్బన్ కట్ చేసి స్టాండ్‌ను ప్రారంభించారు. రోహిత్ శర్మ పేరుతో ఒక స్టాండ్‌ను ఆవిష్కరించడంతో ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) ఆయనకు సముచిత గౌరవం ఇచ్చింది.
Also Read:Minister Dola Bala Veeranjaneya Swamy: దివ్యాంగులపై సర్కార్ కీలక నిర్ణయం..
Also Read
ప్రారంభోత్సవం సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. తన పేరు దిగ్గజాల మధ్య నిలిచి ఉండటం పట్ల కలిగే అనుభూతిని మాటల్లో వ్యక్తపరచలేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మాజీ ఎంసీఏ అధ్యక్షుడు శరద్ పవార్, ప్రస్తుత ఎంసీఏ అధ్యక్షుడు అజింక్య నాయక్, అనేక మంది అధికారులు పాల్గొన్నారు. గతంలో వాంఖడే స్టేడియంలోని స్టాండ్‌లకు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, విజయ్ మర్చంట్, దిలీప్ వెంగ్‌సర్కార్ వంటి అనేక మంది క్రికెట్ దిగ్గజాల పేర్లు పెట్టారు.
Also Read:Pakistan: భారత్‌ని మరిచిపోండి, పాకిస్తాన్ ఈ రెండు రాష్ట్రాల GDPని కూడా దాటలేదు..
రోహిత్ శర్మ మాట్లాడుతూ.. “ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను ఎప్పుడూ కలలో కూడా ఊహించలేదు. చిన్నప్పుడు నేను ముంబై, ఇండియా తరపున క్రికెట్ ఆడాలని అనుకున్నాను. కానీ వాంఖడే స్టేడియంలో నా స్టాండ్ ఉంటుందని కలలో కూడా ఊహించలేదు”. అని రోహిత్ వెల్లడించాడు. రోహిత్ భావోద్వేగ ప్రసంగం చేసి, సమీప భవిష్యత్తులో వాంఖడే స్టేడియంలో భారత్ తరపున వన్డే మ్యాచ్ ఆడాలనే కోరికను వ్యక్తపరిచాడు.
𝗧𝗛𝗘 𝗥𝗢𝗛𝗜𝗧 𝗦𝗛𝗔𝗥𝗠𝗔 𝗦𝗧𝗔𝗡𝗗 🫡🏟#MumbaiIndians #PlayLikeMumbai #RohitSharmaStand | @ImRo45 pic.twitter.com/dqdWu6YSQ5
— Mumbai Indians (@mipaltan) May 16, 2025
#WATCH | Mumbai | At the inauguration ceremony of a stand in Wankhede to be named after him, Indian ODI men's cricket team captain Rohit Sharma says, "What is going to happen today, I have never dreamed of. As a kid growing up, I wanted to play for Mumbai, for India. No one… pic.twitter.com/BH2VCjmxFi
— ANI (@ANI) May 16, 2025
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!