ఈ రోజు ఉదయం 7.30కి ఉండవల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఇక, ఉదయం 10.15కి శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి దుబాయ్ విమానంలో బయలుదేరనున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో మరో మారు ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ల్యాండింగ్ అయ్యింది. అంటోనోవ్ ఎన్ 124 సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంటోనోవ్ ఎన్ 124 ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలలో ఒకటి. క్వాడ్ ఇంజిన్ అంటే 4 ఇంజన్లు ఉన్నాయి. 24 చక్రాలు ఉన్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద కార్గో విమానాలలో ఒకటి, దీనిలో లాంగ్ ట్రక్కులు నేరుగా లోడింగ్, అన్‌లోడ్ కోసం రాంప్‌లను ఉపయోగించి…
Shamshabad Airport: కస్టమ్స్ అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ వన్యప్రాణులను పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి బ్యాంకాక్ నుండి హైదరాబాద్ వచ్చిన ఒక ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి ఒక మానిటర్ బల్లి, ఒక రెండు తలల ఎర్ర చెవి స్పైడర్ తాబేలు, నాలుగు ఆకుపచ్చ ఇగువానాస్, పన్నెండు ఇగువానాస్ లను స్వాధీనం చేసుకున్నారు. Nep vs WI: పరువంతపాయె.. రెండు సార్లు వరల్డ్ కప్ గెలిచిన జట్టుపై పసికూన గెలుపు ఈ…
బంగారం ధర ఆకాశాన్నంటుతోంది. లక్ష రూపాయలకు మించిపోయి చుక్కలు చూపిస్తోంది. దీంతో విదేశాల్లో తక్కువ ధరకు దొరికే బంగారాన్ని అక్రమంగా తీసుకు వచ్చి తెలుగు రాష్ట్రాల్లో విక్రయించేందుకు కొంత మంది కేటుగాళ్లు ప్లాన్ చేశారు. కానీ ఎయిర్ పోర్టులో దిగీదిగగానే.. DRI అధికారులను చూసి బంగారాన్ని వదిలేసి వెళ్లారు. తర్వాత ఆయా వ్యక్తులను DRI అధికారులు అరెస్ట్ చేశారు. నిత్యం ధర పెరుగుతున్న పసిడి ఇప్పుడు లాభసాటి వ్యాపారం. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా సరే.. సౌదీ అరేబియా,…
Alliance Air Flight Emergency Landing After Multiple Attempts in Shamshabad: విమాన ప్రమాదాలు, సాంకేతిక లోపాలతో వెనుతిరగడం లాంటి వార్తలు గతంలో ఎప్పుడోసారి చర్చనీయాంశంగా మారేవి. ఇటీవలి రోజుల్లో మాత్రం రోజుకో ప్రమాద ఘటన జరుగుతుండడంతో సాధారణ వార్తగా మారిపోయింది. ఎన్నో ప్రమాదాలు, సాంకేతిక లోపాలు బయటపడుతున్నా.. విమానాలకు సంబంధించిన కంపెనీలు మాత్రం ఏమీ పట్టనట్లు ఉంటున్నాయి. తాజాగా ఓ విమానంలో సాంకేతిక లోపం చోటుచేసుకున్న ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. Also Read:…
PJR Flyover: హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు సమయం ఆదా చేయడానికి నిర్మించిన మరో ఫ్లైఓవర్ నేటి (జూన్ 28) నుంచి అందుబాటులోకి రానుంది. పీజేఆర్ ఫ్లైఓవర్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించనున్నారు.
SpiceJet : ఈ రోజు ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన స్పైస్ జెట్ విమానం (SpiceJet)లో ప్రయాణికులకు కలవరాన్ని కలిగించే సంఘటన చోటుచేసుకుంది. విమానం తిరుపతి దిశగా ప్రయాణిస్తుండగా, ఆకాశంలో ప్రయాణిస్తున్న సమయంలో పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో అప్రమత్తమయ్యారు. ఎటువంటి ప్రమాదం జరగకమునుపే, విమానాన్ని వెంటనే తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు తీసుకెళ్లారు. Ahmedabad Plane Crash: కేంద్రం కీలక నిర్ణయం.. కొత్త నిబంధనలు జారీ ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. వారు…
విమానం.. ఈ పదం వింటేనే ప్రాణం వణికిపోతోంది. కొన్ని రోజుల క్రితం ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో 270 మంది ప్రాణాలు కోల్పోయారు. విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఓ విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు వస్తున్న విమానంకు బాంబు బెదిరింపు వచ్చింది. జర్మని నుంచి పయనం అయిన విమానంకు బాంబు బెదిరింపు రావడంతో ఫ్రాంక్ ఫర్డ్…
Breaking : ఒక ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనుకున్న వారి కలలు.. నిజానికి ఏకంగా బానిస జీవితం మారాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు ఒక భారీ హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టుచేశారు. మస్కట్‌కి చెందిన వ్యక్తి సుందర్, అతని భారత భాగస్వామి సత్యనారాయణ కలిసి శతృవుల్లా అమాయకుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇద్దరూ కలిసి దాదాపు 2 నుండి 4 లక్షల వరకు ప్రతి వ్యక్తిపై వసూలు చేస్తూ, దుబాయ్ షేక్‌లకు అమ్మేస్తున్న వైనం…
ACB : తెలంగాణలో హల్చల్ రేపిన గొర్రెల పంపిణీ స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఏ1 మొయినుద్దీన్‌ను శుక్రవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గతంలోనే ఆయనపై లుక్ఔట్ నోటీస్ (LOC) జారీ చేయగా, హైదరాబాద్‌కు చేరుకున్న వెంటనే ఇమ్మిగ్రేషన్ అధికారుల సహాయంతో అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు అయినప్పటి నుంచీ మొయినుద్దీన్, ఆయన కుమారుడు ఈక్రముద్దీన్ పరారీలోనే ఉన్నారు. ఇద్దరి పాస్‌పోర్టులను అధికారులు ఇప్పటికే…