RGIA : హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఇటీవల విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతుండటంతో ప్రయాణికుల కష్టాలు పెరిగిపోతున్నాయి. గమ్యస్థానాలకు సరిగ్గా చేరాల్సిన విమానాలు గంటల తరబడి ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. తాజాగా మరోసారి స్పైస్‌జెట్ విమానం ఆలస్యం కావడం విమానాశ్రయంలో కలకలం రేపింది. ప్రయాగ్‌రాజ్ వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో మూడు గంటలుగా ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు విమానం బయలుదేరుతుందా అని ఎదురుచూస్తూ అలసిపోయిన ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో…
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో నాలుగు అంతర్జాతీయ విమానాలు ల్యాండింగ్ అయ్యాయి. అందుకు కారణం.. వాతావరణం అనుకూలించకపోవడం. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో వాతావరణం అనుకూలించకపోవడం కారణంగా అక్కడికి వెళ్లే విమానాలను శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు దారి మళ్లించారు అధికారులు.
Flight Delay : హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తిరుపతి విమానం సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం ఉదయం 5:30 గంటలకు హైదరాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరాల్సిన విమానం టేక్ ఆఫ్‌కు ముందు అనుకోకుండా ఆగిపోవడంతో, తిరుమల దర్శనం కోసం వెళ్లే భక్తులు తీవ్రంగా నిరాశ చెందారు. విమాన సాంకేతిక లోపాన్ని గుర్తించిన వెంటనే, అధికారులు టేక్ ఆఫ్‌ను నిలిపివేశారు. అయితే, దీనిపై ప్రయాణికులకు ముందస్తుగా సమాచారం ఇవ్వకపోవడంతో, వారు…
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌లో బాంబు ఉందంటూ సైబరాబాద్ కంట్రోల్ రూమ్‌కు ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. అప్రమత్తమై ఎయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బంది ముమ్మర తనిఖీలు చేశారు. ఎక్కడా ఏమీ లభ్యం కాలేదు. బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని భద్రతా సిబ్బంది తేల్చింది. బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని ఎయిర్‌పోర్ట్ అధికారులు కూడా ధ్రువీకరించారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి తెలంగాణలోని కామారెడ్డి వాసిగా ఎయిర్‌పోర్ట్ అధికారులు గుర్తించారు.…
జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా పోలీసులు, భద్రతా అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిఘా వర్గాలు రెడ్ అలెర్ట్ ప్రకటించారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న అమర్‌రాజా బ్యాటరీ కంపెనీలో భారీ మంటలు చెలరేగాయి. మూడో అంతస్తులో మంటలు ఎగసిపడుతున్నాయి.
Rammohan Naidu : హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కృషి చేశారని కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు అన్నారు. శంషాబాద్‌లోని నోవాటెల్‌లో ఎయిర్‌పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పట్లో 5 వేల ఎకరాల భూమిని సేకరించడం చిన్న విషయమేమీ కాదన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టును సాకారం చేసిన చంద్రబాబు నాయుడు దార్శనికత వల్లే గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల కాన్సెప్ట్ ఉద్భవించిందని ఆయన ఉద్ఘాటించారు. Andhra Pradesh: ఏపీలో 50 లక్షల…
Shamshabad: హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా నిషేధిత కలుపు మొక్కలను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. హైడ్రోఫోనిక్ కలుపు మొక్కలను అధికారులు సీజ్ చేశారు. పట్టుబడిన కలుపు మొక్కల విలువ సుమారు రూ.2.2 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. బ్యాంకాక్ నుంచి ఓ ప్రయాణికుడు తన ట్రాలీ బ్యాగ్ లో కలుపు మొక్కలను దాచి తరలించే యత్నం చేశాడు. ఇవాళ ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బ్యాంకాక్ నుంచి విమానం ల్యాండ్ అయ్యింది. అయితే బ్యాంకాక్ నుంచి ఓ…
Shamshabad Airport: శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భయాందోళన వాతావరణం నెలకొంది. విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడు చెప్పిన మాటలకు సిబ్బంది పరుగులు పెట్టారు.