Home
Shamshabad Airport
Shamshabad Airport News
-
Rahul Gandhi Sabha: వరంగల్ సభకు బయల్దేరిన రాహుల్
తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు సంఘర్షణ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్నారు రాహుల్ గాంధీ. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌గాంధీకి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి వరంగల్‌కు రాహుల్ గాంధీ హెలికాప్టర్లో వెళ్లనున్నారు. అక్కడినించి హనుమకొండకు బయల్దేరతారు. వరంగల్‌లో రైతు సంఘర్షణ సభకు హాజరవుతారు. రైతు సంఘర్షణ సభ సాయంత్రం 6.05 గంటలకు హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో… -
Drugs: కొకైన్ కడుపులో దాచిన కేటుగాడు.. ఆపరేషన్ చేసి స్వాధీనం
ఎంత నిఘా పెట్టినా.. కఠిన చర్యలు తీసుకుంటున్నా.. డ్రగ్స్ దందా కొనసాగుతుందనేది ఓపెన్ సీక్రెట్.. ఎందుకంటే.. ఎప్పకప్పుడు భారీ స్థాయిలో డ్రగ్స్ దొరుకుతూనే ఉన్నాయి.. ఇక, ఇవాళ సినీ ఫక్కీలో ఓ వ్యక్తి కడుపు డ్రగ్స్ దాచి తరలిస్తున్నాడు.. ఆ వ్యక్తికి ఆపరేషన్ చేసి కొకైన్ క్యాప్సూల్స్ స్వాధీనం చేసుకున్న ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం రేపింది. రూ.12 కోట్ల విలువైన 1,157 గ్రాముల కొకైన్‌ను డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. సౌతాఫ్రికా జోహన్నెస్‌బర్గ్ ప్రయాణికుడు అనుమానాస్పదంగా… -
Shamshabad Airport : మరోసారి భారీగా పట్టుబడ్డ విదేశి కరెన్సీ
స్మగ్లింగ్ చేసేందుకు కొత్తకొత్త పంథాలను ఎంచుకుంటున్నారు. తీరా అధికారులకు దొరికి జైలుపాలవుతున్నారు. అయితే తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో భారీగా విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. సొమాలీయన్ దేశానికి చెందిన మహమూద్ అలీ అనే వ్యక్తి షార్జా వెళ్లేందుకు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానశ్రయానికి చేరుకున్నాడు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా యూఎస్ డాలర్స్‌ను తన లగేజ్ బ్యాగ్‌లో దాచి తరలించేందుకు యత్నించాడు. అయితే మహమూద్ అలీపై అనుమానం వచ్చిన సీఐఎస్ఎఫ్ ఇంటలిజెన్స్ అధికారులు అతడితో… -
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు కొత్త రహదారి
రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో కొత్త దారి ఏర్పాటు కానుంది. ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో వచ్చే నెలలో జరగనున్న శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఈ మార్గాన్ని ఔటర్ రింగు రోడ్డుకు అనుసంధానం చేస్తున్నారు. ఫిబ్రవరి 5న రామానుజుల విగ్రహావిష్కరణ కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడకు రానున్నారు. ఈ రోడ్డు మార్గంలోనే ఆయన ప్రయాణించేందుకు అధికారులు ప్రత్యామ్నాయంగా ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. శంషాబాద్ నుంచి బెంగళూరు జాతీయ రహదారి మీదుగా ఓ దారి, శ్రీశైలం రహదారి… -
శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఓ యువతి హల్ చల్
నేటి యువత మద్యానికి బానిసై తమ నిండు జీవితాలను అంధకారమయం చేసుకుంటున్నారు. మద్యం మత్తులో కన్నుమిన్ను తెలియక అనర్దాలకు పాల్పడుతున్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ.. అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. అయితే పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న యువత మారడం లేదు. మద్యం మత్తులో సుబర్నా పాండే అనే యువతి వీరంగం సృష్టించిన ఘటన తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఇండిగో ఎయిర్‌లైన్స్ ఉద్యోగి తో సుబర్నా పాండే దురుసుగా… -
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి బంగారం పట్టివేత
శంషాబాద్ విమనాశ్రయంలో అక్రమంగా బంగారాన్ని తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన మగ్గురు మహిళల నుంచి 1.48కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో బయటపడ్డ అక్రమ బంగారం రవాణా గుట్టు. వీరిపై కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేశారు. బంగారం విలువ సుమారు రూ.72.80 లక్షల విలువ ఉంటుందని పేర్కొన్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ఫ్లైట్ ద్వారా వచ్చిన మహిళలు పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని ఎవ్వరికి… -
ఎయిర్ పోర్ట్‌లో లంచావతారం.. కస్టమ్స్ అధికారిపై ఫిర్యాదు
ఎయిర్ పోర్టుల్లో కస్టమ్స్ అధికారులు కీలకమయిన విధులు నిర్వర్తిస్తూ వుంటారు. వందల కేజీల డ్రగ్స్, బంగారం, ఇతర స్మగ్లింగ్ వస్తువులు పట్టుబడుతూ వుంటాయి. కానీ కొందరు కస్టమ్స్ అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికుడి వద్ద లంచం డిమాండ్ చేసిన కస్టమ్స్ అధికారి ఉదంతం ఇది. లంచం ఇవ్వడానికి నిరాకరించిన ప్రయాణికుడి విషయంలో దారుణంగా ప్రవర్తించాడా అధికారి. లంచం ఇవ్వటానికి నిరాకరించడంతో కక్షకట్టిన కస్టమ్స్ అధికారులు ప్రత్యేక రూమ్ లోకి తీసుకెళ్ళి… -
చెన్నై, హైదరాబాద్ ఎయిర్ పోర్టులలో బంగారం సీజ్
స్మగ్లర్లు ఏ అవకాశాన్నీ వదలడం లేదు. వివిధ వస్తువుల్లో బంగారాన్ని దాచి మరీ దేశంలోకి ఎంటరవుతున్నారు. ఎయిర్ పోర్టుల్లో తనిఖీల్లో అడ్డంగా బుక్కవుతున్నారు. చెన్నై ఎయిర్ పోర్ట్ లో అక్రమ బంగారం సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. కొలంబో ప్రయాణీకుడి వద్ద 40.28 లక్షల విలువ చేసే 928 గ్రాముల బంగారం సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. సినీ పక్కీలో బంగారాన్ని పేస్టు గా మార్చి కాళ్లకు వేసుకునే చెప్పుల్లో దాచి తరలించే యత్నం చేశాడో కేటుగాడు.… -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆంక్షలు.. వారికి నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి…
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆంక్షలు విధించారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ బయటపడటంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ అప్రమత్తం అయింది. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అదీ 72 గంటల ముందు చేయించుకున్నదై ఉండాలి. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యాక ప్రయాణికులకు మరోసారి పరీక్షలు నిర్వహిస్తారు. Read: ఈ నౌకకు ఇంధనం అవసరం లేదు… ఎంత దూరమైనా… ఈ పరీక్షల్లో పాజిటివ్ వస్తే… -
టాయ్ కార్, వాచ్ లో బంగారం తరలింపు
బంగారం, హెరాయిన్, గంజాయి.. అక్రమార్కులకు ఇవే పెద్ద ఆదాయ వనరులు. ఏ అవకాశాన్నీ వదలడం లేదు. స్మగ్లర్లు దొరికిన చిన్నవస్తువులోనైనా బంగారం దాచేసి తెచ్చేసుకుంటున్నారు. దొరికితే దొంగ.. దొరక్కపోతే దొర. అయితే, కస్టమ్స్ అధికారులు వీరి ఆటలు సాగనివ్వడం లేదు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో వరుసగా పట్టుబడుతోంది అక్రమ బంగారం. READ ALSO గోల్డ్ స్మగ్లింగ్.. కేటుగాళ్ళ రూటే సెపరేటు అక్రమార్కులు వివిధ మార్గాలను ఎంచుకుని బంగారాన్ని విదేశాల నుండి తరలించేందుకు ప్రయత్నించి అడ్డంగా…
తాజావార్తలు
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!