Alliance Air Flight Emergency Landing After Multiple Attempts in Shamshabad: విమాన ప్రమాదాలు, సాంకేతిక లోపాలతో వెనుతిరగడం లాంటి వార్తలు గతంలో ఎప్పుడోసారి చర్చనీయాంశంగా మారేవి. ఇటీవలి రోజుల్లో మాత్రం రోజుకో ప్రమాద ఘటన జరుగుతుండడంతో సాధారణ వార్తగా మారిపోయింది. ఎన్నో ప్రమాదాలు, సాంకేతిక లోపాలు బయటపడుతున్నా.. విమానాలకు సంబంధించిన కంపెనీలు మాత్రం ఏమీ పట్టనట్లు ఉంటున్నాయి. తాజాగా ఓ విమానంలో సాంకేతిక లోపం చోటుచేసుకున్న ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది.
Also Read: Bhatti Vikramarka: సురవరం రాజకీయ జీవితం నేటి యువతకు ఆదర్శం!
శంషాబాద్-తిరుపతి అలియాన్స్ ఎయిర్ లైన్స్ విమానంలో సాంకేతిక లోపం చోటుచేసుకుంది. విమానం మూడు సార్లు రన్‌వే పైకి వెళ్లి తిరిగి వచ్చింది. విమానం టేకాఫ్ తర్వాత పైలెట్ సాంకేతిక లోపం గుర్తించారు. దీంతో వెంటనే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అలియాన్స్ విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నిలిచిపోయింది. ఆ విమానంలో 37 మంది ప్రయాణికులు తిరుపతి వెళ్లాల్సి ఉంది. మూడు సార్లు రన్‌వే పైకి వచ్చి తిరిగి వెనక్కి వెళ్లిన విమానం పట్ల విసుకు చెందిన ప్రయాణికులు అందోళన వ్యక్తం చేశారు. ఐదు రోజుల క్రితం కూడా అలయన్స్ ఎయిర్ లైన్స్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. తిరుపతి వెళ్లాల్సిన 67 మంది ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పడిగాపులు కాశారు. ఆరోజు పైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.