తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న సెవెన్‌హిల్స్ ఎక్స్‌ప్రెస్ రైలులో శుక్రవారం అర్ధరాత్రి భారీ దోపిడీ జరిగింది. అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని తురకపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సిగ్నల్ తీగలను దుండగులు కత్తిరించారు. సిగ్నల్ లేకపోవడంతో రైలు స్టేషన్ అవుటర్‌లోనే ఆగిపోయింది. రైలు ఆగగానే బోగీల్లోకి చొరబడిన దుండగులు మారణాయుధాలు చూపించి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశారు. వారి నుంచి నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ముఖ్యంగా ఎస్ 5, ఎస్ 7, బోగీల్లో ప్రయాణిస్తున్న మహిళల…