ఖమ్మం జిల్లాలో మున్నేరు వరదలో చిక్కుకున్న ఏడుగురి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. మున్నేరు వరద ఉధృతి, సహాయక చర్యలపై మంత్రి పువ్వాడని అడిగి సీఎం కేసీఆర్ తెలుసుకున్నారు. వరద ప్రవాహంలో ఓ ఇంట్లో చిక్కుకున్న ఏడుగురినీ రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని హుటాహుటిన ఖమ్మం తరలించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Kishan Reddy: తెలంగాణ సమాజాన్ని అడ్డు అదుపు లేకుండా దోచుకుంటున్నారు..
సీఎం కేసీఆర్ ఆదేశాలతో భద్రాచలం నుంచి ఖమ్మంకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెళ్లారు. మున్నేరు ప్రవాహంలో చిక్కుకున్న వారిని రెస్క్యూ చేసినట్లు మంత్రి పువ్వాడ చెప్పాడు. విశాఖ నుంచి భద్రాచలం వస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని మార్గమధ్యంలో ఖమ్మం మళ్లించాలని కేసీఆర్ తెలిపారు. ప్రత్యేక డ్రోన్ పంపించి ఇంట్లో చిక్కుకున్న ఏడుగురి పరిస్థితినీ ఆరా తీస్తున్నట్లు ఖమ్మం జిల్లా అధికారులు వెల్లడించారు.
Read Also: Bro Movie: జోరు వర్షంలోనూ తగ్గేదేలే… నైజాంలో రచ్చ రేపుతున్న ‘బ్రో’ అడ్వాన్స్ బుకింగ్స్!
అయితే, ఖమ్మం నగరంలోని పద్మావతి నగర్ లో ధ్యాన మందిరంలో ఉన్న ఏడుగురు నీ కాపాడేందుకు రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. వరద ఉదృతితో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. సహాయక చర్యలను మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి, అదనపు కలెక్టర్ ప్రియాంక పర్యవేక్షిస్తున్నారు. మున్నేరు వరదల్లో చిక్కిన శ్రీరామ చంద్ర మిషన్ హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన మందిరంలోనీ ఏడుగురు పేర్లు.. 1.లక్ష్మీనారాయణ(55), 2.లక్ష్మీ(50) , 3.యశ్వంత్(26), 4.అరవింద్(34), 5.విఘ్నేష్(2), 6. ప్రవల్లిక(27), 7.కావ్య(26)గా గుర్తించారు. ఈ ఏడుగురు బాధితులను అధికారులు సురక్షితంగా రక్షించారు.