AP DGP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకి పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్ ఇచ్చారు. మహిళలు, చిన్నారులపై జరిగే దాడులను ఉక్కుపాదంతో అణిచి వేస్తామన్నారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్ఐలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. ఈ సన్నివేశం మీతో పాటు నాకు కూడా మధుర జ్ఞాపకం అన్నారు. మా ప్రభుత్వం 30 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చింది.. మరో 35 వేల ఉద్యోగాలను ఈ ఏడాది చివరిలోగా ఇస్తామన్నారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశాం.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న పరీక్షలపై ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు అని ఆయన చెప్పుకొచ్చారు.
నన్ను తిట్టే హక్కు బీజేపీ నాయకులకు లేదు.. కేసీఆర్ ఇచ్చే డబ్బు కోసం పని చేసే వ్యక్తిని కాదు.. మిలాగా లొంగిపోను.. అద్వానీ నాకు గురువు.. ఆయన మాకు సంస్కారం నేర్పారు.. మీలాగా అసభ్యకరంగా మాట్లాడను.. నాపై మాట్లాడిన వాళ్ళు నోరు అదుపులో పెట్టుకోండి అంటూ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ తమ యూజర్లకు వార్నింగ్ ఇచ్చింది. చాలా కాలంగా యాక్టివ్ గా లేని గూగుల్ అకౌంట్స్ అన్నింటినీ డిలీట్ చేయనున్నట్లు చెప్పింది. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి అకౌంట్స్ తొలగింపు ప్రక్రియ స్టార్ట్ చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు తమ యూజర్లకు గూగుల్ మెయిల్ ద్వారా వార్నింగ్ మేసేజ్ ను పంపిస్తుంది.