ప్రస్తుతం డైరెక్టర్ వంశీ అనగానే ఏ కృష్ణవంశీనో, వంశీ పైడిపల్లినో గుర్తు చేసుకుంటారు. కానీ, తెలుగు సినిమా రంగంలో చెరిగిపోని ముద్ర వేసిన వంశీకి వెనుకా ముందూ ఏమీ లేకపోయినా, తన సృజనతో వైవిధ్యం పలికిస్తూ సాగారు. ఈ నాటికీ వంశీ సినిమాను చూడాలని ఉవ్విళ్ళూరేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. మరో మాట ఇక్కడ మరచిపోరాదు, ఈ రోజున మాటలతో మాయ చేస్తున్నవారికి వంశీ చిత్రాల్లోని సంభాషణలే ఆదరువు అన్నా అనతిశయోక్తే! గోదావరి అంటే వంశీకి ప్రాణం.…