మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు తెరకు సుపరిచితమే. గతంలో దుల్కర్ నటించిన అనేక డబ్బింగ్ సినిమాలు తెలుగులో రిలీజ్ అయి విజయం సాధించాయి. ఆ మధ్య మహానటిలో జెమినీగణేశన్ పాత్రలో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. దీంతో స్ట్రయిట్ తెలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు దుల్కర్. ఆలా తెలుగులో దుల్కర్ లీడ్ రోల్ లో వచ్చిన మొదటి సినిమా ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది.…