Dulquer Salmaan : మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తన సొంత భాషలో కన్నా టాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు. కెరీర్లో మొదట్లో మహానటిలో జెమిని గణేశన్ పాత్ర చేసి ఔరా అనిపించుకున్నారు. దుల్కర్ ఆ సినిమాతో తెలుగులో తొలి సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత సీతారామం తో సోలో హిట్ అందుకున్నాడు. అదేంటో సీతారామం సినిమా చూసిన తర్వాత ఈ కథ దుల్కర్ కోసమే అన్నట్లు అనిపించింది. ఆ తర్వాత చాలా కథలు వచ్చినప్పటికీ మళ్లీ లక్కీ భాస్కర్ తోనే దుల్కర్ సల్మాన్ మరో హిట్ అందుకున్నాడు. లక్కీ భాస్కర్ సినిమా రిలీజ్ వరకు పెద్దగా బజ్ రాలేదు.. కానీ సినిమా చూసిన ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవ్వడంతో సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది. దుల్కర్ నుంచి తదుపరి ఎలాంటి రాబోతుందన్న చర్చ ఆడియెన్స్ లో మొదలైంది. ఈలోగా కాంతా అంటూ ఒక పీరియాడికల్ మూవీతో త్వరలో రాబోతున్నారు. ఐతే ఇది స్ట్రైట్ తెలుగు సినిమా కాదు. తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ డైరెక్షన్ లో రూపొందుతున్న తెలుగు, తమిళ బైలింగ్వెల్ మూవీ. ఈ సినిమా కథ 1950 బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని సమాచారం. థ్రిల్లర్ నేపథ్యంతో ఈ సినిమా వస్తుందని టాక్. సినిమాలో మిస్టర్ బచ్చన్ ఫేం భాగ్య శ్రీ బోర్స్ నటిస్తుంది.
Read Also:Rohit Sharma Captaincy: రోహిత్ కెప్టెన్సీ అస్సలు బాలేదు.. టీమిండియా మాజీ హెడ్ కోచ్ ఫైర్!
సాధారణంగా కథ నచ్చితేనే దుల్కర్ సినిమా కమిట్ అవుతాడన్న టాక్ ఉంది. లక్కీ భాస్కర్ సినిమా చూసిన తర్వాత దుల్కర్ కథల విషయంలో ఎలా ఆలోచిస్తాడో అర్థం అయింది. అందుకే దుల్కర్ ఎంచుకున్నాడు అంటే కచ్చితంగా కథలో కానీ, కథనంలో కానీ ఆడియన్స్ ని మెప్పించే పాయింట్ ఉంటుందని జనాలు అనుకుంటున్నారు. కాంతా సినిమాలో కూడా అలాంటి మ్యాజిక్ ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా రానా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రానా కూడా కంటెంట్ ఉన్న సినిమాలకు తన సపోర్ట్ అందిస్తున్నారు. సో తెలుగు రిలీజ్ విషయంలో రానా బాధ్యత మీద వేసుకుంటాడని సమాచారం. ఎలాగో దుల్కర్ కి తెలుగు మార్కెట్ బాగుంది కాబట్టి కాంతా సినిమాకు మంచి బిజినెస్ జరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు. కచ్చితంగా దుల్కర్ సల్మాన్ అంచనా ప్రకారం ఈ కాంతా కూడా మరో సూపర్ హిట్ బొమ్మ అవుతుందని అంటున్నారు. కాంతా సినిమా విషయంలో ఆడియన్స్ కూడా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హంగామా చేస్తుందో చూడాలి.
Read Also:MLC Kavitha: రిజర్వేషన్లు తేల్చకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు..