ఆర్థిక సంక్షోభంతో ఆఫ్ఘానిస్తాన్ అతలాకుతలం అవుతోంది. తినడానికి తిండి లేక, చేయడానికి పనిలేక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. చివరికి తినడానికి డబ్బులు లేక తమ అవయాలు సైతం అన్నుకుంటున్న దారుణ పరిస్థితి నెలకొంది. ఇటీవల డబ్బు కోసం కిడ్నీలను అమ్ముకుంటున్న ప్రజలు ఆఫ్ఘనిస్తాన్ లో ఎక్కువైపోతున్నారు. తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇంతకన్నా వేరే మార్గం దొరకలేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు. పనిచేసే సత్తా ఉన్నా పని లేక.. చేసే పనికి వచ్చే డబ్బులు చాలక.. కుటుంబంలోని మగవాళ్ళు…