డాక్టర్ రాజశేఖర్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న సినిమా ‘శేఖర్’. మలయాళ చిత్రం ‘జోసఫ్’కు రీమేక్ అయిన ఈ మూవీని జీవిత డైరెక్ట్ చేశారు. ఈ నెల 20న ‘శేఖర్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. తమిళ సూపర్ హిట్ చిత్రం ‘శేషు’ను తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నప్పుడు పలువురు దర్శకులు కథలో మార్పులు చేర్పులూ చేయాలని సలహా ఇవ్వడంతో అది ఇష్టంలేక తానే తొలిసారి మెగా ఫోన్ పట్టుకున్నానని…
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటిస్తున్న 91వ సినిమా ‘శేఖర్’. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమాలో రాజశేఖర్ పెద్ద కూతురు శివాని రాజశేఖర్ ఓ కీలక పాత్రలో నటించింది. ప్రామిసింగ్ థ్రిల్లర్‌లో ఆమె హీరో కూతురిగా నటించింది. రియల్ లైఫ్ తండ్రీకూతుళ్లు వెండితెర తండ్రీకూతుళ్లుగా నటించడం ఇదే తొలిసారి. తాజాగా ఈ స్టార్ తండ్రీకూతుళ్ళు కలిసి ఉన్న పిక్స్ ను మేకర్స్ విడుదల చేశారు. జీవితా రాజశేఖర్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రాయడమే కాకుండా…
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘శేఖర్’. హీరోగా ఆయన 91వ చిత్రమిది. బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గురువారం ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. అరకు బోసు గూడెం తోట బంగ్లాలో నూతన దంపతులు దారుణ హత్యకు గురయ్యారని ఓ మహిళ చెప్పే వాయిస్ ఓవర్‌తో ఫస్ట్ గ్లింప్స్ మొదలైంది. ఘటనా స్థలానికి పోలీసులు వెంటనే…