బంగారాన్ని అక్రమంగా రావాణాచేసే స్మగ్లర్లు రోజుకో కొత్త పద్దతిలో స్మగ్లింగ్ చేస్తున్నారు. ఎన్ని సార్లు కస్టమ్స్ అధికారులను పట్టుబడినా.. వారిలో మార్పు మాత్రం రావడం లేదు. కొన్ని సార్లు అతి తెలిపి ప్రదర్శిస్తున్నారు.
Cannabis : అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రట్టు చేశారు చౌటుప్పల్ పోలీసులు. గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా వారిని అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు 400కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
మహారాష్ట్రలోని ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 7.87 కోట్ల విలువ చేసే 15 కేజీల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున నిషేధిత గుట్కా, జర్దాను నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషనులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ కెఆర్ నాగరాజు వివరాలు వెల్లడించారు. కొందరు సమాచారం ఇవ్వడంతో.. టాస్క్ ఫోర్స్, సీసీఎస్ ల అధ్వర్యంలో లైన్ గల్లీలో దాడులు నిర్వహించామని తెలిపారు. నిర్వాహకులు మహమ్మద్ అబుబకర్, షేక్ నేహల్ ఇద్దరి కిరాణషాప్, గోదాంలలో నిషేధిత గుట్కా జర్దాను సీజ్ చేసినట్లు…
ఏపీలో థియేటర్లలో తనిఖీలు ముమ్మరం చేశారు అధికారులు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధికంగా టికెట్ రేట్లు వసూలు చేసే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు అధికారులు. తాజాగా విజయనగరం జిల్లాలో మూడు సినిమా థియేటర్లను సీజ్ చేశారు. నిబంధనలను పాటించని సినిమా థియేటర్లపై జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ కిశోర్ కుమార్ కొరడా ఝుళిపించారు. మూడు సినిమా హాళ్లను మూసివేయాలని తాహశీల్దార్‌ను ఆదేశించారు. పూసపాటిరేగ, భోగాపురం, నెల్లిమర్ల మండలాల్లో మంగళవారం ఆకస్మికంగా పర్యటించి, సినిమా థియేటర్లను ఆయన…
రాజస్థాన్ లోని జైపూర్ అంతర్జాతీయ పోస్టాఫీసులో భారీగా ఈము కోడి, నిప్పు కోడి రెక్కలు, ఓ తలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జైపూర్ నుండి లండన్ వెళుతున్న రెండు పార్సల్ లో నిప్పు కోడికి సంబంధించిన రెక్కలు, తల భాగమును కస్టమ్స్ అధికారుల బృందం గుర్తించింది. ఏమాత్రం అనుమానం రాకుండా కొరియర్ ద్వారా విదేశాలకు పక్షుల రెక్కలు తరలిస్తున్నారు. అటవీశాఖ నిబంధనలకు విరుద్దంగా స్మగ్లింగ్ కు తెరలేపిన ఈ కేటుగాళ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు…
ఈమధ్య కాలంలో అంతర్జాతీయ విమానాశ్రయాల్లో డగ్స్, బంగారం పట్టివేత భారీగా జరుగుతోంది. అధికారుల కళ్లుగప్పి అక్రమంగా డ్రగ్స్, బంగారం సరఫరా చేస్తూ అధికారులకు అడ్డంగా దొరికిపోతున్నారు. ఇక తాజాగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బహ్రయిన్ ప్రయాణీకుడి వద్ద రెండు కేజీలకు పైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. బంగారాన్ని కరిగించి పేస్టుగా చేసి కాళ్లకు వేసుకునే సాక్స్ లోదాచాడు కేటుగాడు. చెన్నై ఎయిర్‌పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీలల్లో…
సైబరాబాద్ లో భారీగా నకిలీ విత్తనాలు పట్టుకున్నారు పోలీసులు. దాదాపు మూడు కోట్ల విలువ చేసే విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ విత్తనాలను బ్రాండెడ్ విత్తనాలు అని చెప్పి అమ్ముతున్న ఏడుగురు సభ్యులు గల ముఠాను అరెస్ట్ చేసారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. రైతుల నుంచి నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి బ్రాండెడ్ విత్తనాలుగా ప్యాక్ చేస్తుంది ముఠా. ఆ నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి నష్టపోతున్నారు రైతులు. ఆ విత్తనాలు కొనుగోలు చేసే ముందు ప్యాకింగ్…
హైదరాబాద్ మంగల్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గోదాంపై నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు నిర్వహించారు. ఆకాష్ అనే వ్యాపారి మంగల్‌హాట్ అగపురా సీతారాంబాగ్ లోని గోదాంలో అక్రమంగా ఫారెన్ సిగరెట్లను నిల్వ ఉంచి విక్రయిస్తున్నాడు. పక్క సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. రూ.20 లక్షల విలువ చేసే విదేశీ కంపెనీకి చెందిన ఫారిన్ సిగరెట్లను పోలీసులు సీజ్ చేశారు. పారిస్, బ్లాక్ సిగరెట్స్ దాదాపు 480 సిగరెట్ ప్యాకెట్…
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో భారీగా నకిలీ విత్తనాలను పట్టుకున్నారు జిల్లా పోలీసులు. 60 లక్షల విలువ చేసే నాలుగున్నర క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకొని, ఆరుగురి అరెస్ట్ చేశారు. కర్ణాటక నుండి తెలంగాణకు తీసుకోవచ్చి నకిలీ పత్తి విత్తనాలను రైతులకు అమ్ముతున్నారు. కాగా జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వీరంతా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వ్యక్తులుగా.. మీడియా సమావేశంలో ఎస్పీ భాస్కరన్ వివరాలు వెల్లడించారు.