మత్తు పదార్థాలు జీవితాలను నాశనం చేస్తాయి అని తెలిసి కూడా యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ భారీ మత్తు పదార్థాలను పట్టుకుంటున్న జనాల్లో మార్పు రావడం లేదు.
గుజరాత్‌లోని కచ్ తీరంలో రూ.130 కోట్ల కొకైన్ను పోలీసులు పట్టుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున గాంధీధామ్ పట్టణం సమీపంలోని క్రీక్ ప్రాంతంలో 13 కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. కొకైన్ పట్టుబడకుండ స్మగ్లర్లు సముద్ర తీరంలో దాచిపెట్టినట్లు కచ్-ఈస్ట్ డివిజన్ పోలీస్ సూపరింటెండెంట్ సాగర్ బాగ్మార్ తెలిపారు. కాగా.. ఎనిమిది నెలల్లో ఈ ప్రాంతంలో ఇంత మొత్తంలో డ్రగ్స్ పట్టుబడడం ఇది రెండోసారని అధికారులు పేర్కొన్నారు.
ఒరిస్సా నుంచి హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు అక్రమంగా రవాణా అవుతున్న గంజాయిని గురువారం ఉదయం రైల్లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. భువనేశ్వర్ నుంచి ముంబై వెలుతున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగిలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో గంజాయిని పట్టుబడింది. ఖమ్మం నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు మహబూబాబాద్ వరకు ప్రయాణించి రెండు సూటు కేసుల్లో అక్రమంగా తరలివెలుతున్న గంజాయిని పట్టుకున్నారు. ఈ గంజాయిని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులు మాత్రం తప్పించుకున్నారు.
Elections 2024: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కూకట్‌పల్లిలో భారీగా నగదు పట్టుబడింది. వాహనాల తనిఖీల్లో భాగంగా రాజేంద్ర నగర్ ఎస్‌ఓటీ పోలీసులకు రూ.53.5 లక్షలు పట్టుబడ్డాయి.
స్థానిక అధికారుల కళ్ళు తప్పి తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులో కాలేశ్వరం వద్ద రేషన్ బియ్యాన్ని మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రెండు లారీలను హైదరాబాద్ కు చెందిన సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. ఈ దాడులలో ఏకంగా 900 క్వింటాళ్ళ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ ఆపరేషన్ లో రెండు వాహనాలను సీజ్ చేసి, ఆపై నలుగురిపై కేసు నమోదు చేశారు. పట్టుబడ్డ బియ్యాన్ని సంబంధిత రెవెన్యూ అధికారులకు అప్పగించి., వాహనాలను అలాగే ఆ…
నల్గొండ జిల్లా మిర్యాల గూడలో భారీగా బంగారం పట్టుబడింది. సోమవారం లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో.. ఈదులగూడ చౌరస్తా వద్ద తనిఖీలు చేస్తుండగా.. మిర్యాలగూడ టౌన్ నుంచి కోదాడ వైపు వెళ్తున్న బొలెరో వాహనంలో రూ.5.73 కోట్లు విలువ చేసే 13 కిలోల బంగారం పట్టుకున్నారు. బంగారం, వాహనాన్ని స్వాధీనం చేసుకుని.. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.. కాగా.. బంగారం, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.…
విశాఖపట్నం నగరంలోని నడిబొడ్డున చిరుత పులి చర్మాన్ని రవాణా చేస్తున్న కొందరు కేటుగాళ్లను పోలీస్ అధికారులు పట్టుకున్నారు. నలుగురు వ్యక్తులు చిరుతపులి చర్మాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు డీఆర్‌ఐ( DRI ) వర్గాలకు అందిన సమాచారం మేరకు మంగళవారం నాడు సాయంత్రం పక్కా ప్లాన్ ప్రకారం పట్టుకున్నారు.
తమిళనాడులో శ్రీలంకకు తరలిస్తున్న రూ.108 కోట్ల డ్రగ్స్ ను డీఆర్ఐ, ఇండియన్ కోస్ట్ గార్డ్ లు సీజ్ చేశారు. మండపం తీరంలో ఓ కంట్రీ బోటు నుంచి అక్రమంగా తరలిస్తున్న 99 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఓ అధికారి వెల్లడించారు. డ్రగ్స్ తో వెళ్తున్న పడవ శ్రీలంక వైపు వెళుతుండగా.. పక్కా సమాచారంతో అధికారులు బోటును వెంబడించి పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు సహా నలుగురిని డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేశారు.