Cannabis : అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రట్టు చేశారు చౌటుప్పల్ పోలీసులు. గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా వారిని అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు 400కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల ఫై రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక డ్రైవ్ చేస్తున్నామన్నారు. పక్కా సమాచారంతో గంజాయి ముఠా ను అరెస్ట్ చేశామన్నారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో గంజాయి తీసుకుని మహారాష్ట్ర – కర్ణాటక మీదుగా తరలిస్తున్న గంజాయి ముఠాని గుర్తుంచామన్నారు. డీసీఎం వ్యాన్ లో లోపల ఎవ్వరూ గుర్తించకుండా గంజాయి తరలిస్తున్నారని తెలిపారు. మొత్తం ఈ కేసులో ఏడుగురు ఉన్నారని.. నలుగురు ను ఆరెస్ట్ చెయ్యగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. మొత్తం ఈ గంజాయి నెట్వర్క్ ను నిర్మూలించడానికి కృషి చేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్ వివరించారు.
Read Also: Tension in Ippatam: ఇప్పటంలో టెన్షన్.. జనసేన నేతల ఆందోళన
విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఓ యువకుడిని నల్లగొండ జిల్లా పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఎస్పీ అపూర్వరావు వివరాల ప్రకారం.. నకిరేకల్‌కు చెందిన కొండ తేజ్‌కుమార్ వృత్తిరీత్యా ఆటో డ్రైవరు. ఇతడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం రాంచంద్రాపురంలో నివాసం ఉండేవాడు. ఈజీగా డబ్బులు సంపాదించాలన్న కోరికతో గంజాయి అక్రమ రవాణాను వృత్తిగా ఎంచుకున్నాడు. ఇందుకు గంజాయిని తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు విక్రయించాలనుకున్నాడు. విశాఖ జిల్లా రత్నంపేటకు చెందిన శ్రీనివాస్ వద్ద కిలో రూ.5వేలకు ఒకటి చొప్పున 84 కిలోల గంజాయిని రూ.4.20 లక్షలకు కొనుగోలు చేసి ఆ ప్రాంతానికి చెందిన మరొక వ్యక్తితో హైదరాబాద్‌కు తరలించేందుకు వాహనంలో బయలుదేరారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్‌గేట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా, నిందితులు ఓ వాహనంలో గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. అందులో ఒకరు పారిపోగా తేజ్‌కుమార్‌ను పట్టుకున్నారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.