రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక పోలీసులతో పాటు నార్కోటెట్ సిబ్బంది కలిసి సుమారు వంద కిలోల గంజాయినీ స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, చేవెళ్ల ఏసీపీ ప్రశాంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో వెల్లడించారు.
మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో గత 10 రోజుల్లో 1,179 గ్రాముల బంగారాన్ని మంగళూరు కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మొత్తం బంగారం విలువ రూ.70,02,568.. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మంగళూరు కస్టమ్స్ అధికారుల ప్రొఫైలింగ్ ఆధారంగా, నవంబర్ 9 నుండి 13 మధ్య ఇండిగో ఫ్లైట్ 6E1163 మరియు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ IX814 ద్వారా దుబాయ్ నుండి మంగళూరుకు వెళ్తున్న ఇద్దరు ప్రయాణికులను అడ్డుకున్నారు. వారి లగేజీని స్కానింగ్ చేసి, ఓపెన్…
కేరళలోని కరిపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు భారీగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రయాణికుడు అక్రమంగా తరలిస్తుండగా.. అతని నుండి కొకైన్, హెరాయిన్ ను పట్టుకున్నారు. ఆ డ్రగ్స్ విలువ రూ. 44 కోట్ల విలువ ఉంటుందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు.
నాగ్‌పూర్ విమానాశ్రయం నుంచి రూ. 24 కోట్ల విలువైన 3.07 కిలోల యాంఫెటమైన్-రకం మత్తు పదార్థాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించినందుకు ఢిల్లీకి చెందిన నైజీరియన్ జాతీయుడితో సహా ఇద్దరు వ్యక్తులను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అరెస్టు చేసింది.DRI అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, అధికారుల బృందం నిర్దిష్ట నిఘా ఆధారంగా ఉచ్చు వేసి, ఆగస్టు 20న నాగ్‌పూర్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 43 ఏళ్ల భారతీయుడిని అడ్డగించింది. అతను కెన్యాలోని నైరోబీ…
ఈ మధ్య కాలంలో అక్రమంగా పరిమితికి మించి బంగారాన్ని తరలిస్తున్నారు స్మగ్గలర్స్.. అధికారుల కళ్లు గప్పి తరలించాలని ఎన్నెన్నో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.. చివరికి చిన్న తప్పుతో సులువుగా దొరికిపోతున్నారు. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. హెయిర్ క్లిప్ లలో తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు లో 397 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. హెయిర్ క్లిప్ లలో, బ్యాంగిల్స్ లో కోటింగ్ వేసి…
డఫిల్ బ్యాగ్‌లో దాచి ఇథియోపియా నుంచి ముంబైకి రూ. 15 కోట్ల విలువైన కొకైన్‌ను స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు (డిఆర్‌ఐ) అరెస్టు చేసింది.. నేవీ ముంబైలో నిషిద్ధ వస్తువులను డెలివరీ చేయడానికి అంగీకరించాల్సిన ఉగాండా మహిళను కూడా DRI అరెస్టు చేసింది. ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా, అడిస్ అబాబా నుండి ముంబైకి ఇటి 640 విమానం ద్వారా వచ్చిన కేరళకు చెందిన సాట్లీ థామస్ (44) శుక్రవారం ఛత్రపతి శివాజీ…
హైదరాబాద్ లోని చైతన్యపురిలో పోపిస్ట్రా అనే మత్తుమందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా మత్తుమందును విక్రయిస్తున్న రాజస్థాన్ కు చెందిన రమేష్ అనే వ్యక్తిని ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ముంబై ఎయిర్ పోర్ట్‌లో భారీగా మాదక ద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఓ విదేశీ ప్యాసింజర్ బ్యాగ్ కింది భాగంలో దాదాపు 13 కోట్ల రూపాయల విలువైన 1.3 కిలోగ్రాముల కొకైన్‌ను తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ ఘటనలో ఓ మహిళను కూడా కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.