సైబరాబాద్ లో భారీగా నకిలీ విత్తనాలు పట్టుకున్నారు పోలీసులు. దాదాపు మూడు కోట్ల విలువ చేసే విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ విత్తనాలను బ్రాండెడ్ విత్తనాలు అని చెప్పి అమ్ముతున్న ఏడుగురు సభ్యులు గల ముఠాను అరెస్ట్ చేసారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. రైతుల నుంచి నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి బ్రాండెడ్ విత్తనాలుగా ప్యాక్ చేస్తుంది ముఠా. ఆ నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి నష్టపోతున్నారు రైతులు. ఆ విత్తనాలు కొనుగోలు చేసే ముందు ప్యాకింగ్ పై అన్ని వివరాలు తప్పక చూడాలి అని సీపీ సజ్జనార్ తెలిపారు. రెండు రాష్ట్రాల్లో నకిలీ విత్తనాల దందా కొనసాగిస్తున్నారు. ర విత్తనాలను కొనుగోలు చేసి బ్రాండెడ్ విత్తనాలు గా తయారు చేస్తున్నారు. నకిలీ విత్తనాలు అమ్మే వారి పై అలాగే తయారీ దారుల పై పిడియాక్ట్ నమోదు చేస్తాం అని పేర్కొన్నారు.