దేశ రక్షణే వారికి ప్రాణం. తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి మరీ సరిహద్దుల్ని ఉగ్రమూకల నుంచి కాపాడుతున్నారు. కాశ్మీర్ బోర్డర్ లో తీవ్రంగా మంచు తుఫాను కురుస్తోంది. తన ప్రాణాలకు తెగించి మరీ గస్తీ కాస్తున్నారు భారత జవాన్. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శత్రువుల కంటే ఈ మంచే పెద్ద శత్రువుగా విరుచుకుపడుతోంది. అయినా అలుపెరుగక, దేశ రక్షణకు అంకితం అవుతున్న ఇలాంటి భరత మాత ముద్దుబిడ్డలకు ఎన్టీవీ సలాం చేస్తోంది.…
రక్షణ రంగంలో పురుషులతో పాటుగా మహిళలు కూడా రాణిస్తున్నారు. బోర్డర్‌లో పహారా కాస్తున్నారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, దేశంలో అత్యధిక రిస్క్ ఎదుర్కొంటున్న వ్యక్తుల రక్షణ కోసం మహిళా కమాండోలను నియమించబోతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలకు మహిళా కమాండోలు రక్షణగా ఉండబోతున్నారు. ఈ ముగ్గురికి మహిళా కమాండోలను ఏర్పాటు చేయబోతున్నట్టు రక్షణశాఖ స్పష్టం చేసింది. 32 మంది…
గూగుల్ సంస్థ రూపొందిన గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్‌ను పెద్ద సంఖ్యలోనే వినియోగిస్తున్నారు.. ఆపరేటింగ్ సిస్టమ్స్ నుంచి పనిచేసే దీనిని 2008లో మొట్టమొదటిసారిగా మైక్రోసాఫ్ట్ విండోస్ కోసం తయారు చేశారు. తర్వాత లినక్సు, మాక్ ఓఎస్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ లో కూడా పనిచేసేలా రూపొందించారు. దీనిని ఆధారంగా చేసుకుని గూగుల్ క్రోమ్ ఓఎస్ అనే ఆపరేటింగ్ సిస్టంను తయారు చేసింది.. ఇతర వెబ్ బ్రౌజర్లు ఉన్నా.. గూగుల్ క్రోమ్‌కు మాత్రం మంచి ఆధరణ…
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీకి చెందిన ముంబైలోని నివాసంలో కలకలం రేగింది. ఆయన నివాసానికి అనుమానాస్పద ఫోన్ కాల్స్ రావడంతో అప్రమత్తం అయిన పోలీసులు.. అంబానీ ఇంటి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే, ముంబైలోని ముకేష్ అంబానీ నివాసం అంటిల్లాకు ఈ రోజు అనుమానాస్పద ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ చేసిన వ్యక్తి ట్యాక్సీ డ్రైవర్ అని తేలింది. ఇక, ఇద్దరు వ్యక్తులు ముకేష్ అంబానీ ఇంటికి బ్యాగ్ తీసుకెళ్లాలని కోరారని ఆ…
జాతీయ భద్రత, పౌరుల వ్యక్తిగత గోప్యత కోసం కేంద్ర ప్రభుత్వం చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలపై కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రం నాలుగు చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు నోటీసులు జారీచేసింది. అందులో వివో, ఒప్పో, షావోమీ, వన్ ప్లస్ కంపెనీలు వున్నాయి. ఈ కంపెనీలు తయారుచేసే స్మార్ట్ ఫోన్లలో వాడే వివిధ సాంకేతిక అంశాలను తెలియచేయాలని కేంద్రం నోటీసులిచ్చింది. ఫోన్లలో వాడే హార్ట్ వేర్, సాఫ్ట్ వేర్ వివరాలు, ప్రీ ఇన్‌స్టాల్ యాప్స్,…
విజయదశమి రోజు దేశ వ్యాప్తంగా పండుగ నిర్వహిస్తే, కర్నూలు జిల్లాలోని హుళగుంద మండలంలోని దేవరగట్టు మల్లేశ్వరస్వామి దసరా బన్ని జైత్రయాత్ర ఉత్సవం ఈరోజు జరగనున్నది. ఈ రోజు అర్ధరాత్రి సమయంలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఇక ఉత్సవంలోని మూర్తులను దక్కించుకోవడానికి నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాలను పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడికి తరలి వస్తారు. మరోవైపు అరికెర, అరికెర తండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఆ మూర్తుల…
ఈనెల 30 వ తేదీన జగరబోతున్న హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం పెద్ద ఎత్తున బందోస్తును ఏర్పాటు చేస్తున్నారు. గత ఎన్నికల కంటే ఈ ఉప ఎన్నిక కోసం ఏర్పాటు చేస్తున్న బందోబస్తు మరింత ఎక్కువగా ఉన్నది. 1900 మంది బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. బ్లూకోట్స్, పెట్రో కారులతో పెట్రోలింగ్‌ను నిర్వహిస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘాను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. సమస్యాత్మకమైన ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. హుజురాబాద్ పరిధిలోని…
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. నిందితుల ఇళ్లలోనే వివేకా హత్యకు వాడిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్న అధికారులు ఇవాళ పలువురు స్థానిక నేతలను ప్రశ్నించారు.. మరోవైపు.. తమ ప్రాణాలకు ముప్పు ఉందని వైస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఆ తర్వాత సునీత లేఖపై స్పందించారు కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్.. సునీత కుటుంబ రక్షణ కోసం చర్యలను చేపట్టామని…
ఆనందయ్య మందు తయారీపై సందిగ్ధం కొనసాగుతోంది. ఆనందయ్య మందు హానికరం కాదని ఇప్పటికే ఆయుష్ గుర్తించిన సంగతి తెలిసిందే. ఆనందయ్య మందుపై విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ, తిరుమల ఆయుర్వేద కళాశాలలు మందుపై పరిశోధన ప్రారంభించాయి. ఆనందయ్య మందు తీసుకున్న 500 మంది నుండి వివరాలను సేకరిస్తున్నారు. పరిశోధన రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. పరిశోధనకు సంబందించిన రిపోర్టులు వచ్చేందుకు ఆలస్యం అవుతుంది కాబట్టి మందు తయారీ మరింత ఆలస్యం కావొచ్చని…