భారత గణతంత్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఢిల్లీలో విధుల్లో 30వేలమందికి పైగా భద్రతా సిబ్బంది నిమగ్నమయ్యారు. రాజ్ పథ్ పరిసరప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటుచేశారు. ఉగ్ర హెచ్చరికలతో భారీగా భద్రత ఏర్పాటుచేశారు. రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకూ ఏర్పాట్లు వున్నాయి. ప్రతి సంవత్సరం లక్షమంది పాల్గొనేవారు. ఈసారి 6 వేలమందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు.
అత్యాధునిక సాంకేతిక పద్ధతులు ఉపయోగిస్తున్నారు. డ్రోన్ల ద్వారా దాడులు జరుగుతాయని సమాచారం వుండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. పది గంటలకు అమర జవాన్లకు నివాళులు అర్పించాక ప్రధాని ముఖ్యమయిన కార్యక్రమాల్లో పాల్గొంటారు.