S Jaishankar: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) సమావేశాల్లో భాగంగా ఈ రోజు గోవా వేదికగా ఎస్‌సిఓ కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ మినిస్టర్స్ (సిఎఫ్‌ఎం) జరిగింది. ఈ సమావేశానికి సభ్యదేశాలు అయిన పాకిస్తాన్, చైనా, రష్యా, తజకిస్తాన్, కిర్గిజ్ స్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ దేశాల విదేశాంగమంత్రలు హాజరయ్యారు. పాకిస్తాన్ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ కూడా సమావేశాలకు హాజరయ్యారు. బిలావల్ ను స్వాగతించిన కొద్ది సేపటికే భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఉగ్రవాదంపై స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు.
SCO Foreign Ministers Meeting: గోవాలో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చే నెలలో తమ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ భారత్‌కు వస్తారని పాకిస్థాన్ గురువారం ప్రకటించింది. వచ్చే నెలలో 4-5 తేదీల్లో గోవా వేదికగా ఈ సమావేశం జరగబోతోంంది. దీనికి పాకిస్తాన్ తరుపును ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో నేతృత్వంలో ప్రతినిధి బృందం భారత్ రానుంది. దాదాపుగా తొమ్మిదేళ్ల అనంతరం ఓ…
Ajit Doval: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) సభ్యదేశాలు పరస్పరం తమ ప్రాదేశిక సమగ్రతను గౌరవించుకోవాలని భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ఢిల్లీలో జరిగిన ఎస్‌సిఓ స్థాయి ఎన్ఎస్ఏ సమావేశంలో ఆయన ఇలా వ్యాఖ్యానించారు. సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రతను పరస్పరం గౌరవించుకోవాలని సభ్యదేశాలకు పిలుపునిచ్చారు.
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న భారతదేశం బుధవారం దేశ రాజధానిలో జాతీయ భద్రతా సలహాదారులు (NSA), ఉన్నత అధికారుల సమావేశాన్ని నిర్వహించనుంది.