ఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల పాలన ప్రారంభం నాటి నుంచి నుంచి బాలికలు, మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆఫ్ఘనిస్థాన్‌లో పాఠశాలలు మూసివేయడంతో బాలికలు ఇప్పుడు కుట్టు కేంద్రాల వైపు మొగ్గు చూపుతున్నారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలోని అన్ని పాఠశాలలను సోమవారం ఒక్కరోజు మూసివేస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
మణిపూర్‌లో హింసాకాండ ఎంతకి ఆగడం లేదు. స్కూల్స్ తెరచిన మరుసటి రోజునే ఓ పాఠశాల బయట ఒక మహిళను ఇద్దరు గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా కాల్చి చంపేశారు. గత రెండు నెలలుగా రాష్ట్రంలో కొనసాగుతున్న అల్లర్లు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఇప్పటికీ రాష్ట్ర ప్రజానీకం సాయుధ దళాల మధ్యలోనే జీవనాన్ని కొనసాగిస్తున్నారు.
కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. రాష్ట్రంలోని ఇడుక్కి, కాసరగోడ్, కన్నూర్ 3 జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది.
పశ్చిమబెంగాల్‌లో జరిగిన టీచర్స్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన కేసులో జూలై 9 తర్వాత ఈడీ విచారణకు హాజరవుతానని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలు 2023-24 విద్యా సంవత్సరంలో 229 రోజుల పాటు పని చేయనున్నాయి. అక్టోబర్ 13 నుంచి 25 వరకు 13 రోజులపాటు దసరా సెలవులను ఇవ్వనున్నారు.
Summer Vacation Extended: ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాఠశాలలకు మే 31 వరకు ఇచ్చిన వేసవి సెలవులను పొడిగించారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని పాఠశాలలకు వేసవి సెలవులను పొడిగించారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగించినట్టు పుదుచ్చేరి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నమశ్శివాయం ప్రకటించారు. మంత్రి మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ… పుదుచ్చేరి రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టలేదని, అందువల్ల విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని జూన్ 1వ తేదీకి…
Private Schools: ప్రైవేటు స్కూళ్ల అనుమతుల కోసం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ.. దరఖాస్తు చేసుకోవటానికి ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించింది… ఈ రోజు విజయవాడలో టెన్త్ ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. ఈ సందర్భంగా ప్రైవేట్ స్కూళ్ల అనుమతుల కోసం రూపొందించిన కొత్త పోర్టల్‌ను లాంచ్ చేశారు.. ఇప్పటి వరకు మ్యాన్యువల్ విధానంలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా.. దీనిలోని లోపాలను అధిగమించటానికి ఆన్ లైన్ విధానం అందుబాటులోకి తెచ్చారు..…
దేశరాజదాని ఢిల్లీలో ఎండ తీవ్రత పెరిగింది. వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది. వేడిగాలుల నేపథ్యంలో పాఠశాలలకు ఢిల్లీ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది.