తెలంగాణంలో ఇవాళ్టి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ కు సెలవులు స్టార్ట్ అయ్యాయి. ఈ నెల17 వరకూ సెలవులు కొనసాగుతాయని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రకటించారు.
అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు జనవరి 22న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సెలవు ప్రకటించారు. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంతో పాటు ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఉండవని ముఖ్యమంత్రి తెలిపారు.
తెలంగాణ సర్కార్ సంక్రాంతి పండుగకు సంబంధించి అధికారికంగా పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ఓ ప్రకటనలో పేర్కొంది.
IMD Alert: రానున్న మూడు రోజుల్లో తమిళనాడులోని 18కి పైగా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణ మార్పుల కారణంగా తమిళనాడులోని 18 జిల్లాలకు పైగా రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD ఒక ప్రకటనలో తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వం పలు పండగలకు సెలవులను ప్రకటించింది. దసరా పండగ సెలవులను తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. అలాగే, క్రిస్మస్, సంక్రాంతి సెలవులపై కూడా ప్రకటన రిలీజ్ చేసింది. దసరా, బతుకమ్మ వేడుకల సందర్భంగా 13 రోజులు దసరా సెలవులు ఇచ్చింది.
కేరళలో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. ఈ కారణంగా ఈరోజు అక్కడ విద్యాసంస్థలను మూసివేశారు. కొట్టాయం, వైకోమ్, చంగనస్సేరి తాలూకాల్లోని విద్యాసంస్థలకు జిల్లా యంత్రాంగం సెలవు ప్రకటించింది.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో శనివారం కురిసిన భారీ వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలో కేవలం నాలుగు గంటల్లో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా అధికారులు పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు.