కరోనా కారణంగా తల్లిదండ్రుల ఆదాయం తగ్గడంతో అప్పటివరకూ ప్రైవేట్ స్కూళ్ళలో వేలకు వేలు ఫీజులు కట్టి చదివించిన వారు సర్కారీ బడుల బాట పట్టారు. చదువు ఎలా వున్నా ఫర్వాలేదు.. ఆర్థిక భారం మోయలేమంటూ వారంతా ప్రభుత్వ పాఠశాలలను ఆశ్రయించారు. అయితే పరిస్థితులు మారాయి. భుత్వ పాఠశాలల నుండి తిరిగి ప్రైవేట్ స్కూల్స్ కి విద్యార్థుల వలసలు పెరిగాయంటున్నారు అధికారులు. కరోన కారణంగా లాక్ డౌన్, ఫీజులు కట్టలేక తమ పిల్లలను ప్రైవేట్ నుండి ప్రభుత్వ పాఠశాలల్లో…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకానికి ఇక నుంచి 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని మంత్రి పేర్ని నాని అన్నారు. నవంబర్ 8,2021 నుంచి ఏప్రిల్30,2022 వరకు సుమారు 130 రోజులు విద్యా సంవత్సరంగా ఉందని, ఇందులో ఖచ్చితంగా75 శాతం హాజరు ఉంటేనే అమ్మ ఒడి పథకానికి అర్హులు అవుతారని మంత్రి స్పష్టం చేశారు. గత రెండేళ్లుగా కరోనా ఉండటంతో ఈ నిబంధనను అమలు చేయలేదని, ఇక నుంచి ఖచ్చితంగా అమలు…
కరోనా మహమ్మారికి పుట్టినిల్లు ఏది అంటే అంతా చైనా పేరును చెబుతారు.. మొదట్లో ఆ ఆదేశాన్ని కలవరానికి గురిచేసిన కోవిడ్ 19.. అన్ని దేశాల్లో ఆందోళనకర పరిస్థితికి చేరుకునేసరికి.. అక్కడ మాత్రం ఏమీ లేకుండా పోయింది. అయితే, అప్పుడప్పుడు.. కొత్త వేరియంట్లు వెలుగు చూస్తూ డ్రాగన్ కంట్రీని షేక్ చేస్తూన్నాయి. ఇప్పటికే పలు దాపాలుగా చైనాను మహమ్మారి పలకరించిపోయింది.. తాజాగా.. మరోసారి కలవరం సృష్టిస్తోంది.. దీంతో, కట్టడి చర్యలకు దిగింది కమ్యూనిస్టు సర్కార్.. వందలాది విమాన సర్వీసులను…
తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.. ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా రేపటి నుంచి అంటే అక్టోబర్ 6వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలువులు ఇచ్చినట్టు ప్రకటించింది ప్రభుత్వం.. ఇక, ఈ నెల 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు జూనియర్ కళాశాలలకు దసరా సెలవులు ఉంటాయని వెల్లడించింది… దసరా సెలవుల్లో ఎలాంటి తరగతులు నిర్వహించ వద్దని అన్ని జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డ్ ఆదేశాలు జారీ…
కరోనా ఫస్ట్ వేవ్‌తో పాటు సెకండ్ వేవ్ భారత్‌లో కల్లోలమే సృష్టించింది.. అయితే, భారత్‌లో ఎక్కువగా ఇబ్బంది పడింది.. ఎక్కువ కేసులు వెలుగు చూసింది మాత్రం మహారాష్ట్రలోనే.. ఇక, ఆ రాష్ట్ర రాజధాని ముంబైలోనే పెద్ద సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదు అవుతూ వచ్చాయి.. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. దీంతో.. మహారాష్ట్రతో పాటు ముంబైలో అక్టోబర్ 4 నుంచి స్కూళ్లను ప్రారంభించాలని నిర్ణయించింది ప్రభుత్వం.. మొదట.. 8-12 తరగతుల విద్యార్థులకు భౌతిక క్లాసులు ప్రారంభిస్తామని బృహన్…
అఫ్ఘాన్‌లో ఏర్పాటైన తాలిబన్ల ప్రభుత్వం మహిళల హక్కులను కాలరాస్తోంది. తాలిబన్లు కాబుల్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు మూసివేశారు. దీనిపై తాలిబన్ల ప్రభుత్వం కొత్త ప్రకటనను విడుదల చేసింది. దేశంలో ఉన్న మదర్సాలు, ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని తెలిపింది. కాని అందులో అమ్మాయిలు ఉండరని స్ఫష్టం చేసింది. ఈ ప్రకటన వెలువడిన తర్వాత విద్యార్థులందరూ కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ అమ్మాయిలను కూడా…
భారత్‌లో వెలుగుచూస్తోన్న కరోనా పాజిటివ్ కేసుల్లో.. ఇంకా మెజార్టీ కేసులు కేరళలోనే వెలుగుచూస్తున్నాయి.. ఇవాళ ఆ రాష్ట్రంలో కొత్తగా 19,675 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 45,59,628కి పెరిగింది. ఇవాళ మరో 142 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. దీంతో.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 24,039కి చేరింది. అయితే, ఇక, విద్యాసంస్థలు తిరిగి ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది కేరళ ప్రభుత్వం.. నవంబర్ 1వ తేదీ నుంచి కేరళలో విద్యాసంస్థలు…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత ఆ ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం ఇప్పటి వరకు గుర్తించలేదు. చాలా దేశాలు ఈ విషయంలో ఆచీతూచీ వ్యవహరిస్తున్నాయి. దీంతో ఆఫ్ఘన్ ప్రభుత్వానికి అందించే నిధులు చాలా వరకు ఆగిపోయాయి. తాజాగా ఆ దేశంతో అంతర్జాతీయ ద్రవ్యనిథి సంస్థ సంబంధాలను తాత్కాలికంగా తెంచుకుంది. అంతర్జాతీయ సమాజం గుర్తింపు లేకపోవడంతో ఆఫ్ఘన్ ప్రభుత్వానికి నిధులు అందించలేమని ఐఎంఎఫ్ సంస్థ తెలియజేసింది. దీంతో ఆఫ్ఘన్ దేశానికి…
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్థికంగా నిలదొక్కుకున్న దేశాలు సైతం కరోనా దెబ్బకు కుదేలయ్యాయి. కరోనా ఎలా వస్తుంది. దాని వలన వచ్చే ఇబ్బందులు ఎంటి? కరోనా అంటే ఎంటి… ఎలా ఒకరి నుంచి మరోకరికి సోకుతుంది… క్వారంటైన్, చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర విషయాలను విద్యార్థులకు బోధించేందుకు పశ్చిమ బెంగాల్ సిద్దమైంది. 11 వ తరగతిలోని హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్‌లో పాఠ్యాంశంగా బోధించనునన్నారు. 11 వ తరగతికి…
రామచంద్రాపురం పట్టణంలోని చాకలిపేట హైస్కూల్ ను సందర్శించి పిల్లలతో కలిసి తిన్నారు మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ. అనంతరం ఆయన మాట్లాడుతూ… నాడు-నేడు పనులు, విద్యా కానుక కిట్లు పంపిణీని పరిశీలించాను. జగనన్న గోరుముద్ద ద్వారా అందిస్తున్న భోజన సదుపాయాలను అకస్మిక తనీఖీ చేసాను. చాలా రుచికరమైన భోజనం అందిస్తున్నారు.. నేను స్వయంగా తిని చూసాను. జగనన్న గోరు ముద్ద ద్వారా అందిస్తున్న భోజనం మా ఇంటి భోజనం కన్న గొప్పగా ఉందని విద్యార్థులు చెప్పుతుంటే చాలా…