Boy Missing : వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ శివారులోని మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలలో ఒక విద్యార్థి అదృశ్యం కలకలం రేపుతోంది. కొడంగల్ మండలం గుండ్లకుంట గ్రామానికి చెందిన పదవ తరగతి శివానంద్ గొల్ల (17) కనిపించకుండాపోవడంతో విద్యార్థి తల్లిదండ్రలు ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఈనెల 5వ తేదీన టెలిగ్రాంలో తన బాబాయ్ ఫోనులోకి తన ఫొటో పంపించాడు. అయితే.. పాఠశాలలో ఉన్న విద్యార్జి తన ఫోన్‌కి ఫొటో ఎలా పంపడాని ప్రధానోపాధ్యాయుడుని విద్యార్థి బాబాయ్ ప్రశ్నించాడు. అయితే.. ప్రిన్సిపాల్ 5,6 తేదీలలో విద్యార్థి శివనంద్ అడుగగా సమాధానం చెప్పలేదు. అయితే.. శివనంద్ ను క్లాస్ టీచర్, ప్రిన్సిపాల్ మందలించి ఇంటర్నల్ పరీక్ష రాయనీయలేదు. దీంతో విద్యార్థి మనస్థాపానికి గురై 6వతేదీ రాత్రి గురుకులం నుండి వెళ్ళిపోయాడు.
Formula E Car Race Case : కేటీఆర్‌కు దెబ్బ మీద దెబ్బ.. సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం
తరువాత తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇట్టి విషయంపై పోలీసులు, పాఠశాల యాజమాన్యం గాలింపు చర్యలు చేపట్టారు. అబ్బాయి పరిగి లాడ్జింగ్‌లో రాత్రి బస చేసి ఉదయం ఎనిమిది గంటలకు పరిగి లోని లాడ్జిల్లో చెక్ అవుట్ చేసి వెళ్లిపోయినట్లు సీసీ ఫుటేజ్ లభించింది. అయితే.. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. అయితే.. మరోవైపు విద్యార్థి గురుకుల పాఠశాల నుంచి బయటకు వచ్చిన పాఠశాల సిబ్బందికి తెలియకపోవడం వారి నిర్లక్ష్యాన్ని చూపుతోందని సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.