మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ అరెస్ట్‌కు ఏపీ పోలీసుల యత్నం అన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. సీమెన్స్ కేసులో తమకు తెలిసిన సమాచారం ఇవ్వాలంటూ అప్పటి అధికారులకు ప్రశ్నావళి ఇవ్వడానికి వెళ్ళిన డీఎస్పీ. దర్యాప్తునకు అవసరమైన సమాచారాన్ని సేకరించే ప్రయత్నం. దీన్ని వక్రీకరించి అరెస్టుకు యత్నం అంటూ ప్రచారం దురదృష్టకరం అని అధికారులు వివరణ ఇచ్చారు, పీవీ రమేష్ అరెస్టు అనేది అవాస్తవం. ఆయన ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో అధికారులు తిరిగి వచ్చేశారు. పీవీ రమేశ్…
ఏపీలో స్కిల్ స్కాం కేసులో గంటా సుబ్బారావును ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసుపై గంటా సుబ్బారావు తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. గంటా సుబ్బారావు ఒక సాక్షి మాత్రమే అని, సాక్షిగా రమ్మని సమన్లు పంపి ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. సీమెన్స్ అగ్రిమెంట్ సమయంలో సుబ్బారావు లేరని, రాజ్యాంగ విరద్దుంగా సాక్షిని నిందితుడిగా చూపించారని అన్నారు. కుల ప్రాతిపదికన గంటా సుబ్బారావు ముందున్న అధికారిని పక్కన…
నేటి సమాజంలో మోసాలు పెరిగిపోయాయి. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి మంచి పనులు చేస్తుంటే.. మరి కొందరు మాత్రం టెక్నాలజీని వాడి మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. గుజరాత్ అహ్మదాబాద్‌కు చెందిన హేమలి అనే మహిళ ఇతర వ్యక్తులను వాట్సాప్ డీపీగా పెట్టుకొని.. వారికి సంబంధించిన వారికి మెడికల్ ఎమర్జేన్సీ అని చెప్పి డబ్బులు కావాలంటూ మెసేజ్‌లు పెట్టేది. అయితే తెలిసిన వ్యక్తి ఆపదలో డబ్బు సహాయం అడుగుతున్నారని వారు కూడా డబ్బులు పంపేవారు.…
మోసగాళ్లు రోజురోజుకు మితిమీరి పోతున్నారు. కొత్త కొత్త పంథాలతో అమాయకులను టార్గెట్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. కాంట్రాక్ట్ ఇప్పిస్తానంటూ ఓ కేటుగాడి బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్‌కు చెందిన జేసీబీ, ట్రాక్టర్ల యాజమానులకు ప్రభుత్వం కాంట్రాక్ట్‌లు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి నమ్మబలికాడు. దీంతో సదరు వ్యక్తి మాటలు నమ్మిన జేసీబీ, ట్రాక్టర్ల యాజమానులు ముడుపులు ముట్టజెప్పారు. ఇంకేముంది.. ఆ ముడుపులు తీసుకు ఆ కేటుగాడు పరారయ్యాడు. దీంతో మోసపోయామని తెలిసిన జేసీబీ, ట్రాక్టర్ల యజమానులు మహబూబాబాద్…
యూపీ సంస్థ, ప్రమోటర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదువజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు సంబంధించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసు కంటే ఎక్కువ విలువైన బైక్ బాట్ కుంభకోణం యూపీలో వెలుగు చూసింది.దీనిపై దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టి గేషన్ (సీబిఐ) 15,000 కోట్ల రూపాయల స్కాంకు సంబంధించి నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసింది.ఉత్తరప్రదేశ్‌కు చెందిన బైక్ బాట్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ భాటి మరో 14 మందితో కలిసి దేశవ్యాప్తంగా…
ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు పాల్పడిన ఏడు గురిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బ మండలంలో ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయనే వార్తలు రావడంతో స్పందించిన అధికారులు విచారణ చేపట్టారు. సుమారు రూ.3.5 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు విచారణలో అధికారులు గుర్తించారు. దీంతో ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా పంచాయతీ అధికారిణిగా ఉన్న పార్వతిని సస్పెండ్ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కోన శశిధర్…
రిజిస్ట్రేషన్ శాఖలో తవ్వేకొద్ది అక్రమాలు బయటకొస్తున్నాయి.. ఈ శాఖలో కొందరి ఆగడాలకు హద్దే లేకుండా పోయింది. 2018-19 సంత్సరానికి ముందు జరిగిన రిజిస్ట్రేషన్లలో ఏది ముట్టుకున్నా.. దాని వెనుక ఏదో ఒక అక్రమం బయటపడుతోంది. మొన్నటి వరకు నకిలీ చలానాలు వ్యవహారం దుమారం రేపితే.. ఇప్పుడు ఏకంగా చలనాలే లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు బయట పడింది.ప్రజల సౌకర్యాల కోసం సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు చేయాలి.. ఇదీ ప్రజలకు ప్రభుత్వ సేవలను దగ్గర చేసేందుకు తీసుకున్న ప్రయత్నాలు. అయితే కొందరు…
స్కాలర్ షిప్ పేరుతో హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దాదాపు కోటి రూపాయలు వసూళ్ళు చేసి ఉడాయించారు నిర్వాహకులు. గ్రీన్ లీఫ్ ఫౌండేషన్ పేరుతో అమాయకులను నిలువునా ముంచారు కంత్రిగాళ్లు. ఓ అప్లికేషన్ లో విద్యార్దుల పూర్తి వివరాలు తీసుకున్న నిర్వాహకులు… సర్వీస్ చార్జీల పేరుతో ఒక్కొక్కరి వద్ద 3 వేల నుండి 4 వేల రూపాయలు వసూళ్ళు చేసారు. స్కాలర్‌షిప్ ఏమి అయ్యాయి అంటూ బాధితులు నిలదీసిన…. పొంతన లేని…