హైదరాబాద్ బషీర్ బాగ్లోని సీసీఎస్ ముందు సాహితి ఇన్ ఫ్రా కంపెనీ బాధితులు ఆందోళనకు దిగారు. ఫ్రీలాంఛ్ పేరిట 2500 మందిని మోసం చేశారంటూ బాధితులు నిరసన చేపట్టారు. శర్వాణి ఎలైట్ పేరుతో 10 టవర్లు నిర్మిస్తామంటూ రూ.1500 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్ రావు అరెస్ట్ తో బాధితులు బయటకొస్తున్నారు. ఉమామహేశ్వరరావు తమను వేధింపులకు గురి చేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కేసు విచారణ వేగవంతం చేయాలని…
ఇటీవల సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ప్రత్యేకంగా బ్యాంక్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని కొత్త స్మిషింగ్ అటాక్ మొదలైంది. అయితే ఇది కూడా ఒక రకమైన ఫిషింగ్ దాడి. స్మిషింగ్ అనేది ఒక రకమైన సైబర్ దాడి. ఇది ఎస్ఎంఎస్, ఫిషింగ్ కలయిక. అయినప్పటికీ, ఇది సున్నితమైన సమాచార మార్పిడిని ప్రభావితం చేయగలదు. ఎందుకంటే.. ఇందులో ఎస్ఎంఎస్ రూపంలో మోసపూరిత సందేశం ముందుగా బ్యాంకు ఖాతాదారుల సంఖ్యకు పంపబడుతుంది. ఆ తర్వాత ఖాతాదారుడి బ్యాంకు…
ఈ రోజుల్లో మరింత చాలామంది డిజిటల్ సృష్టికర్తలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు పుట్టుకొస్తున్నారు. కొంతమంది యూట్యూబ్ లాంటి వాటిని కెరీర్‌గా మార్చుకుని విపరీతమైన డబ్బును సంపాదిస్తారు. అద్భుతమైన కంటెంట్‌ను ఎలా సృష్టించాలో మీకు తెలిస్తే, మీరు కోట్ల రూపాయలను సంపాదించవచ్చు. ఇందుకోసం అనేక సోషల్ మీడియాలు నిజంగా ప్రోత్సహిస్తున్నాయి. చాలా మంది యూట్యూబర్‌లు ఇప్పటికే మిలియన్ల కొద్దీ సబ్‌స్క్రైబర్ లను పొందారు. వారి ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేశారు. కానీ ఒకరు తన ప్రతిభను చూపించి యూట్యూబ్…
రైతు బజార్ పేరిట భారీ అవినీతికి తెరలేపారు రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపాలిటీ కొంత మంది కౌన్సిలర్లు. నార్సింగ్ మున్సిపాలిటీ ఏర్పడి నాలుగు సంవత్సరాలు గడుస్తున్న ప్రతి ఏడాది నిర్వహించవలసిన వేలంపాటను నిర్వహించకుండా నార్సింగ్ మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు అడ్డుకుంటున్నారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై మరో కేసు నమోదైంది. టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఏపీఎమ్‌డీసీ ఇచ్చిన ఫిర్యాదుతో ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ-1గా పీతల సుజాత, ఏ-2గా చంద్రబాబు, ఏ-3గా చింతమనేని ప్రభాకర్, ఏ-4గా దేవినేని ఉమాలు ఉన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కామ్ ల రాజా అని, పాపం పండి నేడు పోలీసులు అరెస్టు చేశారని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమే చంద్రబాబును అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారని, వారి ఆరోపణలలో వాస్తవం లేదన్నారు.
ఆమె చనిపోయిన పదేళ్ల తరువాత ట్యాక్స్ చెల్లించాలని నోటీసులు వచ్చాయి. అది కూడా లక్షో.. రెండు లక్షలో కాదు ఏకంగా రూ.7.55 కోట్ల ట్యాక్స్ చెల్లించాలంటూ నోటీసులు వచ్చాయి.
లోన్ యాప్ వేధింపులు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. లోన్ యాప్ ఏజెంట్లు మరీ బరితెగించి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లి ఇబ్బందులకు గురి చేస్తుండటంతో లోన్ తీసుకున్న బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
అవినీతి లేని చోటు లేదు. ప్రభుత్వ ఆఫీసుల నుంచి మొదలుకొని ప్రైవేటు సంస్థల వరకు ఎక్కడ చూసిన అవినీతి జరుగుతూనే ఉంది. అయితే ప్రైవేటు సంస్థల్లో కొంత తక్కువగా ఉంటుందనేది వాస్తవం.