మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ అరెస్ట్‌కు ఏపీ పోలీసుల యత్నం అన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. సీమెన్స్ కేసులో తమకు తెలిసిన సమాచారం ఇవ్వాలంటూ అప్పటి అధికారులకు ప్రశ్నావళి ఇవ్వడానికి వెళ్ళిన డీఎస్పీ. దర్యాప్తునకు అవసరమైన సమాచారాన్ని సేకరించే ప్రయత్నం. దీన్ని వక్రీకరించి అరెస్టుకు యత్నం అంటూ ప్రచారం దురదృష్టకరం అని అధికారులు వివరణ ఇచ్చారు,
పీవీ రమేష్ అరెస్టు అనేది అవాస్తవం. ఆయన ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో అధికారులు తిరిగి వచ్చేశారు. పీవీ రమేశ్ అడ్రస్ మారిందని తెలిసింది. ఆ అడ్రస్‌కు స్పీడ్‌పోస్టులో ప్రశ్నావళి పంపుతున్నాం. దర్యాప్తునకు అవసరమైన సమాచారాన్ని సేకరించే ప్రయత్నమే ఇది. దీన్ని వక్రీకరించి అరెస్టుకు యత్నం అంటూ ప్రచారం దురదృష్టకరం అని అధికారులు అన్నారు.