India’s GDP grows at 6.3% in Jul-Sept quarter of FY23: భారతదేశ జీడీపీ వృద్ధిరేటు 2023 ఫైనాన్షియల్ ఇయర్‌కు సంబంధించి జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 6.3 శాతంగా నమోదు అయింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(క్యూ2)లో భారత ఆర్థిక వ్యవస్థ 6.3 శాతం వృద్ధి చెందిందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఓ) వెల్లడించింది. బుధవారం అధికారిక డేటాను విడుదల చేసింది. ఇదిలా ఉంటే ఇది గతేడాదితో పోలిస్తే ఇది తక్కువే. 2021-22 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 8.4గా ఉంది.
Read Also: Python Attack: మనిషిపై కొండచిలువ దాడి.. గంటపాటు పోరాటం.. చివరకు ఏమైందంటే..?
ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో నమోదు అయిన 13.5 శాతం వృద్ధి రేటులో సగానికి పైగా వృద్ధిరేటు తాజా త్రైమాసికంలో నమోదు అయింది. రేటింగ్ ఏజెన్నీ ఇక్రా ప్రకారం.. భారత జీడీపీ రెండో త్రైమాసికంలో 6.5 శాతానికి పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం తన నివేదికలో జూలై-సెప్టెంబర్ వృద్ధిరేటు 5.8 శాతంగా ఉంటుందని అంచానా వేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కూడా ఈ ఏడాది మొదట్లో ప్రకటించిన దాని ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 6.1-6.3గా ఉంటుందని అంచానా వేసింది. ఈ అంచనాల ప్రకారమే క్యూ2 ఫలితాలు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే చైనా ఆర్థిక వృద్ధిరేటు జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి గానూ 3.9 శాతం నమోదు చేసింది.