రాష్ట్రంలో డ్రగ్స్ పైన నిఘా పెట్టాలని, ఈగల్ ఉందని డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆగాల్సిన పని లేదని ఏపీ వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. డ్రగ్స్ పని చేయనివి కూడా మార్కెట్లో దొరుకుతున్నాయని, తనకే అలాంటి పరిస్ధితి ఎదురైందన్నారు. ఎక్స్‌పైరీ మందులు, నిషేధించిన మందులు కూడా దొరుకుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ప్రభుత్వంలో జనరిక్, జన ఔషధి కేంద్రాలు తీసుకొచ్చారని సత్యకుమార్ తెలిపారు. శ్రీకాకుళం, విశాఖ, అమలాపురం, నరసరావుపేట, ఒంగోలు, కావలి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, కర్నూలు లలో కార్యాలయ భవనాలు.. విశాఖ, కర్నూలులో డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్‌లను మంత్రి సత్యకుమార్ వర్చువల్‌గా ప్రారంభించారు.
‘పూర్తయిన భవనాలు మొంథా తుఫాను కారణంగా ప్రారంభించలేకపోయాం. డ్రగ్ రెగ్యలేటరీ సర్వీసులు, ఆరోగ్య విధానాలు బలోపేతం చేయడానికి కేంద్రం నిధులు విడుదల చేసింది. గత ప్రభుత్వంలో భవన నిర్మాణాలు నత్తనడకన నడిచాయి. ఇప్పుడు భవనాల నిర్మాణం పూర్తవుతోంది. ప్రభుత్వానికి నెలకు 15 లక్షల అద్దె కలిసొస్తుంది. 16600 డ్రగ్ శాంపిల్స్ సంవత్సరానికి టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ చేస్తున్న 4 వేల శాంపిల్స్ చేస్తున్నాం, పూర్తయిన ల్యాబ్‌లతో మరో 3 వేల శాంపిల్స్ టెస్టింగ్ చేస్తాం. ఇంకా కొన్ని టెస్టింగ్ ల్యాబొరేటరీలు పూర్తయితే మరో 10 వేల శాంపిల్స్ టెస్టింగ్ చేయగలుగుతాం. ఆరోగ్యం బాగుపడేలా పటిష్ఠ వ్యవస్ధను తీర్చి దిద్దాలి. సిబ్బంది కొరత కూడా ఉంది.. దాదాపు 83 మంది వరకూ అనలిస్టులు కావాల్సి ఉంది. ఏపీపీఎస్సీ ద్వారానే కాకుండా రెగ్యులర్ విధానంలోనూ నియామకాలు చేపట్టాలని ఫైనాన్స్ ను కోరాం. టెక్నాలజీని అనుసంధానం చేసుకుని మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది’ అని మంత్రి సత్యకుమార్ అన్నారు.
Also Read: CM Chandrababu: వాజ్‌పేయ్ అజాత శత్రువు.. ప్రతి భారతీయుడు గర్వపడే నాయకత్వాన్ని దేశానికి ఇచ్చారు!
‘ఫార్మా హబ్‌గా తయారవుతున్న ఏపీలో డ్రగ్ కంట్రోల్ యాక్ట్ బలంగా ఉంది. ప్రధాని మోడీ ప్రభుత్వంలో జనరిక్, జన ఔషధి కేంద్రాలు తీసుకొచ్చారు. ఎక్స్‌పైరీ మందులు, నిషేధించిన మందులు కూడా దొరుకుతున్నాయి. డ్రగ్స్ పని చేయనివి కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి, నాకే అలాంటి పరిస్ధితి ఎదురైంది. డ్రగ్స్ పైన నిఘా పెట్టాలి, ఈగల్ ఉందని డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆగాల్సిన పని లేదు. డ్రగ్ కంట్రోల్ అధికారులపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఆకస్మిక తనిఖీలలో 97% లోపాలున్నాయి. అంటే.. అధికారులలోనూ లోపాలున్నాయి. చిన్న నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణం పోకూడదు. డ్రగ్ కంట్రోల్ అధిలారులు ప్రజారోగ్య రక్షణ ముఖ్యంగా పని చేయాలి. నిషేధిత మందులు, జనరిక్ మెడిసిన్ల గురించి ప్రజల్లో అవగాహన కలిగించాల్సి ఉంది. డాక్టర్ ఇచ్చే మందుల చీటీ లేకుండా అమ్మకాలు జరిగితే కఠిన చర్యలుంటాయి’ అని మంత్రి సత్యకుమార్ వార్నింగ్ ఇచ్చారు.