పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం ఎక్కువే. ఇక్కడి నుంచి స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య వరుసగా నాలుగుసార్లు గెలిచారు. ఇక 2014లో టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు నర్సరావుపేట నుంచి సత్తెనపల్లికి వచ్చి పోటీ చేసి గెలిచారు. తర్వాత 2019లో ఇదే నియోజకవర్గం నుంచి ఓడిపోయారాయన. కోడెల అకాల మరణంతో సత్తెనపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ పదవి ఖాళీ అయ్యింది. ఆ పోస్ట్ కోసం పోటీ కూడా ఓ రేంజ్‌లో నడిచింది.
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీవీ ఛానెల్స్, సోషల్ మీడియాలో తన రెండో అల్లుడు, డాక్టర్ గౌతమ్ తన మీద చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ చేశాయని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లి వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
ఏదైనా ప్రాంతంలో వజ్రాలు దొరకుతాయంటే ఎవరైనా ఊరికే ఉంటారా?. వెంటనే వజ్రాల కోసం వేట ప్రారంభించేస్తారు కదా. అలాంటి సంఘటనే పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జరుగుతోంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వజ్రాలు దొరుకుతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో భారీగా ప్రజలు అక్కడికి తరలివచ్చి వజ్రాల వేటను ప్రారంభించారు.
తన ప్రాణం ఉన్నంతవరకు సత్తెనపల్లిలోనే ఉంటానని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. సత్తెనపల్లే తన నివాసప్రాంతమని ఆయన అన్నారు. ఈ విషయంలో రాజకీయాలతో సంబంధం లేదన్నారు.
Nadendla Manohar: పదవుల్లో ఉన్నామని అహంకారంతో ఉంటే.. ఎన్నికల్లో ప్రజలు సాగనంపడం ఖాయం అని హెచ్చరించారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. జనసేన కార్యాలయంలో సత్తెనపల్లి గంగమ్మకు ఆర్ధిక సాయం అందించిన నాదెండ్ల మనోహార్.. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబుపై ధ్వజమెత్తారు.. రూ. 5 లక్షల నష్టపరిహారం చెక్ ఇవ్వకుండా మంత్రి అంబటి అడ్డుకున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి.. ఇప్పటికీ నష్టపరిహరం ఇవ్వలేదంటూ విమర్శించారు.. దీంతో, బాధితురాలు గంగమ్మకు జనసేన తరపున ఆర్థిక సాయం…
Andhra Pradesh: సంక్రాంతి లక్కీ డ్రా వ్యవహారంలో మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్కులేషన్ స్కీమ్స్ నిషేధ చట్టం కింద మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సంక్రాంతి లక్కీ డ్రా టిక్కెట్లను ఒక్కొక్కటి రూ.100 చొప్పున మంత్రి అంబటి రాంబాబు సహా వైసీపీ నేతలు విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ…
Ambati Rambabu: తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి వేడుకలు జోరుగా సాగుతున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచే భోగి మంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, రంగవల్లులతో ప్రజలు వేడుకలను జరుపుకుంటున్నారు. మరోవైపు సత్తెనపల్లిలో నిర్వహించిన బోగిమంటల కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భోగి మంటలు వేశారు. అనంతరం గిరిజనులతో కలిసి ఆటపాటలతో హుషారెత్తించారు. ఈ వేడుకల్లో ఆయన వేసిన బంజారా డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. Read Also: Lalit…
Andhra Pradesh: వైఎస్ఆర్ పేరుతో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంక్రాంతి లక్కీడ్రాను నిర్వహించారు. ఈ లక్కీ డ్రాలో గుంటూరుకు చెందిన గుడే వినోద్ కుమార్ రూ. 16 లక్షల విలువైన వజ్రాల హారాన్ని దక్కించుకున్నాడు. జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం రాత్రి ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, కల్పలతారెడ్డి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మితో కలిసి మంత్రి అంబటి రాంబాబు లక్కీ డ్రా తీశారు. ఇందులో వినోద్ కుమార్ విజేతగా నిలిచి వజ్రాల…
సంక్రాంతి పండుగ నేపథ్యంలో లక్కీ డ్రా పేరుతో టికెట్లు విక్రయిస్తున్నారంటూ మండిపడుతున్నారు జనసేన నేతలు.. ఈ విషయంలో మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పోలీస్ స్టేషన్‌లో మంత్రి అంబటి రాంబాబుపై ఫిర్యాదు చేశారు జనసేన పార్టీ నేతలు.. సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో టిక్కెట్లు విక్రయిస్తున్నారని.. నియోజకవర్గంలో విచ్చలవిడిగా లక్కీ డ్రా టికెట్ల అమ్మకాలు సాగుతున్నాయని అంటున్నారు.. అసలు ఈ టికెట్ల విక్రయానికి సచివాలయలు టికెట్స్ కౌంటర్లుగా మారిపోయాయని.. వాలెంటిర్ల…