Telugu Desam Party: ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు అన్నా క్యాంటీన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. పేదలకు తక్కువ ధరకే ఆహారం అందించేందుకు టీడీపీ నేతలు అన్నా క్యాంటీన్‌లను అందుబాటులోకి తెస్తున్నారు. అయితే కొన్ని చోట్ల అనుమతులు తీసుకోకుండా వీటిని ఏర్పాటు చేస్తుండటంపై వివాదాస్పదం అవుతోంది. మరోవైపు అన్నా క్యాంటీన్‌ల ఏర్పాటు విషయంలో టీడీపీ నేతల్లో సమన్వయం కొరవడుతోంది. తాజాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీలో వర్గ విభేదాలు వెలుగు చూశాయి. పోటీపోటీగా…
గుంటూరు జిల్లా పేరేచర్ల-కొండమోడు రహదారి విస్తరణ పనులు చేపట్టాలంటూ సత్తెనపల్లి టీడీపీ కార్యాలయం నుంచి టీడీపీ నేత కోడెల శివరాం చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తుగా ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో సత్తెనపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతకుముందు రాజుపాలెం నుంచి దేవరంపాడు గుడి వరకు పాదయాత్రను ప్రారంభించేందుకు ఎన్టీఆర్ భవన్‌కు వెళ్లిన కోడెల శివరాం టీడీపీ కార్యాలయంలో జెండా ఎగురవేశారు. అనంతరం…
ఆ నియోజకవర్గానికి ఇంఛార్జ్ లేరు. ఆ పదవికోసం చాలామంది క్యూ కడుతున్నారు. మాకంటే మాకు ఇంచార్జ్ పదవి ఇవ్వాలని అధినేతకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? ఎవరా నాయకులు? సత్తెనపల్లి టీడీపీ ఇంఛార్జ్ పదవి కోసం పోటీ..! సత్తెనపల్లి నియోజకవర్గం ఇప్పుడు గుంటూరు జిల్లా టీడీపీలో హాట్ టాపిక్. జిల్లాలో 17 నియోజకవర్గాలుంటే 16చోట్ల టీడీపీకి ఇంఛార్జ్‌లు ఉన్నారు. ఒక్క సత్తెనపల్లికి మాత్రమే ఇప్పటివరకూ తెలుగుదేశంపార్టీ ఇంఛార్జ్‌గా ఎవరినీ నియమించలేదు. గతంలో టీడీపీ సీనియర్ నేత…
గుంటూరు జిల్లాలో ఓ మహిళపై కొంతమంది దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మేడికొండూరు మండలంలోని పాలడుగులో ఈ సంఘటన జరిగింది. బుధవారం రాత్రి గుంటూరులోని ఓ వివాహానికి హాజరయ్యి బైక్ వస్తున్న భార్య, భర్తలను మేడికొండూరు మండలంలోని అడ్డరోడ్డు వద్ద అడ్డుకున్నారు. భర్తను చితకబాది, మహిళను కత్తులతో బెదిరించి పోలాల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బుధవారం అర్థరాత్రి సత్తెనపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని జరిగిన విషయాన్ని పోలీసులకు తెలియజేసింది. అయితే, సంఘటన జరిగిన ప్రాంతం గుంటూరు అర్బన్…
అక్కడ టీడీపీకి అభిమానులు.. కార్యకర్తలు బాగానే ఉన్నారు. పార్టీని నడిపించే నాయకుడే కరువయ్యాడు. ఎవరికి బాధ్యతలు అప్పగించాలో అధినేతకు కూడా అంతు చిక్కడంలేదా .. లేక యథావిధిగా నానబెడుతున్నారా? నాయకుడు లేని పార్టీలో ఏం చెయ్యాలో కేడర్‌కు కూడా అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? శివరామ్‌కు బాధ్యతలు అప్పగింతపై బాబు డైలమా? గుంటూరు జిల్లా సత్తెనపల్లి టీడీపీ చుక్కాని లేని నావలా తయారైంది. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య తర్వాత నియోజకవర్గంలోని…