Nadendla Manohar: పదవుల్లో ఉన్నామని అహంకారంతో ఉంటే.. ఎన్నికల్లో ప్రజలు సాగనంపడం ఖాయం అని హెచ్చరించారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. జనసేన కార్యాలయంలో సత్తెనపల్లి గంగమ్మకు ఆర్ధిక సాయం అందించిన నాదెండ్ల మనోహార్.. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబుపై ధ్వజమెత్తారు.. రూ. 5 లక్షల నష్టపరిహారం చెక్ ఇవ్వకుండా మంత్రి అంబటి అడ్డుకున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి.. ఇప్పటికీ నష్టపరిహరం ఇవ్వలేదంటూ విమర్శించారు.. దీంతో, బాధితురాలు గంగమ్మకు జనసేన తరపున ఆర్థిక సాయం చేస్తున్నామని వెల్లడించారు.. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా దారుణాలు, దాడులు పెరిగాయని విమర్శించారు. జనసేన ఏ కార్యక్రమం చేపట్టినా ఆటంకాలు కలిగిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాల నుంచి పార్టీ సభల వరకూ ఆంక్షలే అని మండిపడ్డారు.
Read Also: INDvsAUS 2nd Test: ఖవాజా ఫిఫ్టీ.. లంచ్ బ్రేక్ సమయానికి ఆసీస్ 94/3
గంగమ్మ కుమారుడు సెప్టిక్ ట్యాంకులో పడి ప్రాణాలు కోల్పోయాడు.. మంత్రి అంబటి రాంబాబు బయటకు రాకుండా పంచాయతి చేశారని.. సీఎం సహాయ నిధి నుంచి సాయం అందిస్తామని వివాదం కాకుండా జాగ్రత్త పడ్డారని విమర్శించారు నాదెండ్ల మనోహర్.. రూ. 5 లక్షలు మంజూరైతే.. అందులో సగం తమకు ఇవ్వాలని అంబటి హెచ్చరించాడని ఆరోపించారు.. దీంతో మమ్మల్ని కలిసి అంబటి బెదిరింపులను ధైర్యంగా చెప్పారు. ఆ సభలో మా అధినేత వైసీపీ దాష్టికాలను ప్రశ్నించారు. అంబటి రాంబాబు అవినీతిని నిలదీశారు.. నా తప్పును నిరూపించండని అంబటి రాంబాబు సవాల్ ను జనసేన స్వీకరించిందన్నారు.. బాధితురాలు గంగమ్మకు అండగా నిలబడి అంబటి అవినీతిని బయట పెట్టామని ప్రకటించారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా గంగమ్మ ధైర్యంగా నిలబడ్డారు.. ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఒక పేద మహిళను ఇబ్బందులు పెట్టారని ఫైర్ అయ్యారు. చివరికి రూ. 5 లక్షల చెక్ ఆమెకు ఇవ్వకుండా వెనక్కి పంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సత్తెనపల్లి ప్రజల ఓట్లతో గెలిచి ఆ ప్రజల పైనే ప్రతీకారమా..? మీ కక్షలతో పేదల జీవితాలతో ఆడుకుంటారా..? చెక్ కనిపించడం లేదని అధికారులు కూడా డ్రామాలు ఆడతారా? చేతికి వచ్చిన కొడుకు చనిపోతే ఆ తల్లి మీద కనీస జాలి లేదా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. పదవుల్లో ఉన్నామని అహంకారంతో ఉంటే.. సాగనంపడం ఖాయమని హెచ్చరించిన ఆయన.. ఎన్ని ప్రయత్నాలు చేసినా అంబటి రాంబాబు అధికారం అండతో డబ్బులు రాకుండా చేశారని.. అక్క, చెల్లెళ్లు అని చెప్పే సీఎం జగన్‌కి చిత్తశుద్ధి ఉంటే అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ తల్లికి జరిగిన అన్యాయంపై జనసేన మానవత్వంతో స్పందించింది. మా వంతుగా నాలుగు లక్షల రూపాయలు గంగమ్మకు అంద చేశాం. సవాల్ చేసిన అంబటి రాంబాబు రాజీనామా చేసి మాట మీద నిలబడాలంటూ తాజాగా సవాల్ విసిరారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.