పార్వతీపురం మన్యం జిల్లాలో కురుపాం నియోజకవర్గం ఒకటి. ఇక్కడ రెండుసార్లు వైసీపీ జెండా రెపరెపలాంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరేయాలన్నది కేడర్ ఆలోచనగా ఉంటే.. నాయకుల వర్గపోరు ప్రమాద సంకేతాలు ఇస్తోందట. కురుపాం నియోజకవర్గ ఇంఛార్జ్‌గా తోయక జగదీశ్వరిని నియమించినప్పటి నుంచీ పరిస్థితి మారిపోయిందనేది తమ్ముళ్ల మాట. ఇంఛార్జ్ నియామకాన్ని లోకల్ పార్టీ నేతలు లక్ష్మణరావు, సత్యనారాయణ వ్యతిరేకిస్తున్నారు. కలిసి పనిచేయడానికి అస్సలు ముందుకు రావడం లేదట. ఇంఛార్జ్ జగదీశ్వరికి మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు…