భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించారు. పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర మంత్రి ఉషాశ్రీచరణ్, ట్రస్ట్ సభ్యులు రత్నాకర్ స్వాగతం పలికారు.