Heavy Devotees: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి వెలుపల క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక, టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతుంది.
Tirumala Darshanam: తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఎప్పటిలాగే ఈ వారం చివరలోనూ భక్తుల భారీ రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం కోసం భక్తులు విపరీతంగా తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల సంఖ్య అధికంగా ఉండటంతో కంపార్టుమెంట్లకు వెలుపల కూడా క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ప్రస్తుతం సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. ఇక గురువారం శ్రీ వేంకటేశ్వర స్వామిని 69,019 మంది భక్తులు దర్శించుకున్నారు.…