Tirumala Darshanam: తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఎప్పటిలాగే ఈ వారం చివరలోనూ భక్తుల భారీ రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం కోసం భక్తులు విపరీతంగా తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల సంఖ్య అధికంగా ఉండటంతో కంపార్టుమెంట్లకు వెలుపల కూడా క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ప్రస్తుతం సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. ఇక గురువారం శ్రీ వేంకటేశ్వర స్వామిని 69,019 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 37,774 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.
Read Also: Child Abuse: మానవత్వం మంటగలిపే ఘటన.. ఆరేళ్ల బాలికపై లైంగికదాడి..!
ఇక హుండీలో భక్తులు సమర్పించిన కానుకలు మొత్తం రూ. 3.42 కోట్లుగా తేలినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. శ్రీవారి దర్శనం కోసం వస్తున్న భక్తులకు తాగునీరు, ఆహారం వంటి అవసరమైన సదుపాయాలు అందించేందుకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల భద్రతకు పోలీసులు, వాలంటీర్లు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టారు.