Heavy Devotees: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి వెలుపల క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక, టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతుంది. ఇక, నిన్న శ్రీవారిని 65, 234 మంది భక్తులు దర్శించుకోగా.. 26, 133 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా, ఆ శ్రీనివాసుడి హుండీ ఆదాయం 3.8 కోట్ల రూపాయలు వచ్చింది.
Read Also: Andhra Premier League: నేటి నుంచి విశాఖలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్.. షెడ్యూల్ ఇదే..!
అయితే, తిరుమలలో శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు ముగిశాయి. ఇవాళ్టి నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు పున:ప్రారంభం కానున్నాయి. కాగా, రేపు శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ వాహన సేవ జరగనుంది. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు మలయప్ప స్వామి దర్శనం ఇవ్వనున్నారు. సెప్టెంబర్ లో వార్షిక బ్రహ్మోత్సవాలు నేపథ్యంలో రేపటి గరుడ సేవను ట్రయల్ రన్ గా టీటీడీ నిర్వహించనుంది. ఇక, ఈఱోజు తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం జరగనుంది. సాయంత్రం 6 గంటలకు స్వర్ణ రథంపై అమ్మవారు ఊరేగనున్నారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా టీటీడీ భారీ భద్రత ఏర్పాట్లు చేసింది.