Santhanam: కోలీవుడ్ స్టార్ కమెడియన్ సంతానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన దగ్గర సునీల్ ఎలాగో.. అక్కడ సంతానం అలా అని చెప్పొచ్చు. ఇప్పుడు సునీల్ లానే కామెడీ హీరోగా మారి మంచి విజయాలనే అందుకుంటున్నాడు. ఇక తాజాగా సంతానం నటించిన చిత్రం వడక్కుపుట్టి రామస్వామి. పీపుల్స్ మీడియా ఈ సినిమాను నిర్మిస్తుంది.
Santhanam comments on telugu audience: మన్మధ, నేనే అంబానీ, రాజు రాణి.. ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు సుపరిచితమైన పాపులర్ తమిళ యాక్టర్ సంతానం హీరోగా నటించిన హారర్ కామెడీ ఎంటర్ టైనర్ ‘డీడీ రిటర్న్స్’. సురభి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ఎస్.ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఆర్కే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై సి.రమేష్ కుమార్ నిర్మించిన ఈ సినిమా జూలై 29న తమిళంలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని…
Karthi: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యనే పొన్నియిన్ సెల్వన్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తీ ఇప్పుడు జపాన్ తో అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నాడు.
'గూఢచారి' వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పలు అద్భుత విజయాలను సాధించింది. హిట్స్ సాధించి తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది.
‘జై భీమ్’ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కన్పించడం లేదు. ఈ వివాదంపై రోజుకొకరు మాట్లాడడంతో అది చిలికి చిలికి గాలి వానగా మారుతోంది. సినిమా వివాదం కాస్తా రాజకీయ రంగును పులుముకుంటోంది. తాజాగా ‘జై భీమ్’ సినిమా కాంట్రవర్సీపై పాపులర్ కమెడియన్ షాకింగ్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. హీరోగా మారిన ప్రముఖ కమెడియన్ ‘సంతానం’ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. Read Also : ట్రైలర్ : రూపాయ్ పాపాయ్ లాంటిదిరా… దాన్నెలా పెంచి పెద్ద…
తమిళ చిత్రసీమలో కమెడియన్ సంతానంకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అతనికంటూ కొంతమంది అభిమానులు ఉన్నారు. దాంతో సంతానం హీరోగానూ తన అదృష్టం పరీక్షించుకునే పనిలో పడ్డాడు. అలా మూడేళ్ళ క్రితం ‘సర్వర్ సుందరం’ అనే సినిమా తెరకెక్కింది. కానీ గ్రహచారం బాగోక ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా అది ఇప్పటి వరకూ విడుదలకు నోచుకోలేదు. అయితే… గత యేడాది ఈ సినిమా దర్శకుడు ఆనంద్ బల్కీ ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడంపై అభిప్రాయం చెప్పమని నెటిజన్లను కోరాడు.…