Santhanam: తెలుగు ప్రేక్షకులే రియల్ సినిమా లవర్స్ : తమిళ నటుడు సంతానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Santhanam comments on telugu audience: మన్మధ, నేనే అంబానీ, రాజు రాణి.. ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు సుపరిచితమైన పాపులర్ తమిళ యాక్టర్ సంతానం హీరోగా నటించిన హారర్ కామెడీ ఎంటర్ టైనర్ ‘డీడీ రిటర్న్స్’. సురభి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ఎస్.ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఆర్కే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై సి.రమేష్ కుమార్ నిర్మించిన ఈ సినిమా జూలై 29న తమిళంలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ క్రమంలో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మాతలు ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ ఆగస్టు 18న ఈ సినిమాను ‘డీడీ రిటర్న్స్ భూతాల బంగ్లా’’ పేరుతో తెలుగులో గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.
Mr. Pregnant: ‘విజయ్’కి అర్జున్ రెడ్డి, ‘సిద్దు’కి డీజే టిల్లు, ‘సోహైల్’కి మిస్టర్ ప్రెగ్నెంట్
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్ ని లాంచ్ చేసింది. ఇక ఈ క్రమంలో ప్రెస్ మీట్ లో హీరో సంతానం మాట్లాడుతూ ‘డీడీ రిటర్న్స్’ తమిళ్ లో బిగ్గెస్ట్ హిట్ అయ్యి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోందని అన్నారు. నా సినిమా తెలుగులో విడుదల చేయడం నా డ్రీం, మంచి ప్రాజెక్ట్ కోసం ఎదురు చూశానని అన్నారు. ఇక ఈ సినిమా విడుదలైతే అందరూ ఎంజాయ్ చేసేలా ఉండాలి అనుకున్నానని, ఇప్పుడు ‘డీడీ రిటర్న్స్ భూతాల బంగ్లా’’ చిత్రంతో తెలుగులో రావడం ఆనందంగా ఉందని అన్నారు. అందరూ ఎంజాయ్ చేసే సినిమా ఇదని పేర్కొన్న ఆయన తెలుగు ప్రేక్షకులే రియల్ సినిమా లవర్స్ అని అన్నారు. ఇక్కడి ప్రేక్షకుల ప్రేమ ప్రోత్సాహంతో ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ని సాధించిందని అన్నారు. ఇప్పుడు ఒక మంచి చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నామని ఆయన అన్నారు. ఈ సినిమాను పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారని, చాలా యునిక్ గా ఉంటుందని పేర్కొన్న ఆయన ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని అన్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?