Karthi: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యనే పొన్నియిన్ సెల్వన్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తీ ఇప్పుడు జపాన్ తో అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఇక తాజాగా కార్తీ తన సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేయగా.. అది వైరల్ గా మారింది. కార్తీ పక్కన ఒక సుందరాంగి నిలబడి .. అతని బుగ్గను ఆనించి మరీ ఫోటోకు పోజ్ ఇచ్చింది. దీంతో ఎవరా.. అందగత్తె అని అభిమానూలు ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే కొంచెం ఆ సుందరాంగిని తీక్షణంగా చూస్తే అమ్మాయి కాదు అబ్బాయి అని తెలిసిపోతుంది. ఆమె సారీ .. సారీ అతను ఎవరో కాదు కమెడియన్ సంతానం.
Balayya : నోరు జారిన బాలయ్య.. శ్రీలీలా సీక్రెట్ రివిల్..
ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన సంతానం .. ఇప్పుడు హీరోగా పలు సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక ఒక సినిమా కోసం సంతానం అమ్మాయి గెటప్ లో రెడీ అయ్యినట్లు తెలుస్తోంది. ఇక కార్తీ ఈ ఫోటోను షేర్ చేస్తూ కరీనా చోప్రా అంటూ క్యాప్షన్ పెట్టుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారాయి. వ్వావ్.. కరీనా చోప్రా అద్భుతంగా ఉంది. మీ కొత్త సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వండి అని కొందరు. కోలీవుడ్ లో కొత్త హీరోయిన్ వచ్చింది అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం సంతానం కిక్ డీడీ రిటర్న్ సినిమాల్లో నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతో సంతానం ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.