‘జై భీమ్’ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కన్పించడం లేదు. ఈ వివాదంపై రోజుకొకరు మాట్లాడడంతో అది చిలికి చిలికి గాలి వానగా మారుతోంది. సినిమా వివాదం కాస్తా రాజకీయ రంగును పులుముకుంటోంది. తాజాగా ‘జై భీమ్’ సినిమా కాంట్రవర్సీపై పాపులర్ కమెడియన్ షాకింగ్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. హీరోగా మారిన ప్రముఖ కమెడియన్ ‘సంతానం’ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
Read Also : ట్రైలర్ : రూపాయ్ పాపాయ్ లాంటిదిరా… దాన్నెలా పెంచి పెద్ద చేయాలంటే…!
విషయంలోకి వెళ్తే… నటుడు సంతానం నెక్స్ట్ మూవీ ‘సభాపతి’. డెబ్యూ డైరెక్టర్ శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రీతి వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఎంఎస్ భాస్కర్, పుగజ్ తదితరులు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. నవంబర్ 19న ఈ సినిమా వెండితెరపైకి రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు విలేకరులతో సమావేశమయ్యారు చిత్రబృందం. ఈ మీడియా సమావేశంలో వన్నియార్ కమ్యూనిటీ చిత్రీకరణపై పీఎంకే, సూర్య మధ్య జరుగుతున్న గొడవపై సంతానం స్టాండ్ గురించి ఓ విలేఖరి ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సంతానం స్పందిస్తూ “ఇతరులను కీర్తించేందుకు ఒక వర్గాన్ని చెడుగా చూపించడం సరికాదు” అని అన్నారు. అయితే ఆయన ఇటు ‘జై భీమ్’కు వ్యతిరేకంగా లేదా పిఎంకే పార్టీ న్యాయ పోరాటానికి తన మద్దతును మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. కానీ ఈ కామెంట్స్ ను బట్టి చూస్తే ఆయన ‘జై భీమ్’కు వ్యతిరేకంగానే ఉన్నట్లు అర్థమవుతోంది.
Read Also : సంక్రాంతి వార్ పై ప్రొడ్యూసర్స్ గిల్డ్ భేటీ
సోషల్ మీడియాలో “ఐ స్టాండ్ విత్ సూర్య” హ్యాష్‌ట్యాగ్‌ల గురించి ప్రశ్నించినప్పుడు ఆయన తన పనిలో నిమగ్నమై ఉండడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్నది ఏదీ తనకు తెలియదని చెప్పుకొచ్చాడు. అయితే సంతానం ఇలా స్పందించడం పట్ల సూర్య అభిమానులు మండిపడుతున్నారు. సంతానం సూర్యతో కలిసి ‘సిల్లును ఒరు కాదల్’, ‘సింగం 2’ వంటి చిత్రాలలో నటించారు. కాగా పిఎంకె పార్టీ నాయకుడు డాక్టర్ ఎస్ రామదాస్ పట్ల సంతానం తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేయడంతో పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయనను పిఎంకె మిత్రపక్షంగా పరిగణిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో భారీ ఎత్తున #SuriyaAgainstVanniyars, #WeStandWithSanthanam అనే హ్యాష్ ట్యాగ్ లను ట్రెండ్ చేస్తున్నారు. ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.