Santhanam: కోలీవుడ్ స్టార్ కమెడియన్ సంతానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన దగ్గర సునీల్ ఎలాగో.. అక్కడ సంతానం అలా అని చెప్పొచ్చు. ఇప్పుడు సునీల్ లానే కామెడీ హీరోగా మారి మంచి విజయాలనే అందుకుంటున్నాడు. ఇక తాజాగా సంతానం నటించిన చిత్రం వడక్కుపుట్టి రామస్వామి. పీపుల్స్ మీడియా ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇక ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఫిబ్రవరి 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చెన్నెలో నిర్వహించారు. ఈ ఈవెంట్ కు హీరో ఆర్య గెస్ట్ గా హాజరు అయ్యాడు.
ఇక ఈ ఈవెంట్ లో సంతానం తన అప్పులు గురించి మాట్లాడం హాట్ టాపిక్ గా మారింది. ” నా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆర్య గెస్ట్ గా రావడం ఆనందంగా ఉంది. ఆర్య, నేను మంచి స్నేహితులం. నేను ఎక్కడికి వెళ్లినా ఆర్యను అడుగుతారు. ఆర్య ఎక్కడికి వెళ్లినా నా గురించి అడుగుతారు. అయితే మేమిద్దరం స్నేహితులమని అలా అడగరు.. మేము చేసిన అప్పుల వల్ల అలా విచారిస్తారు అని నవ్వేశాడు. అదేంటి అంత స్టార్ కమెడియన్ కు అప్పులు ఉండడమేంటి అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇక ఆర్య గురించి చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఆయనపై ఎన్నో వివాదాలు వచ్చాయి. అప్పులు తీసుకొని ఎగొట్టాడని కూడా ఆరోపణలు వచ్చాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.