Srisailam: శ్రీశైలంలో ఇవాళ్టితో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.. సాయంత్రం అశ్వవాహనంపై పూజలు అందుకోనున్నారు ఆదిదంపతులు.. ఆలయంలో శ్రీస్వామి, అమ్మవారికి ఆలయ ఉత్సవం నిర్వహించనున్నారు.. రాత్రి పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు ముగింపు పలకనున్నారు.. ఏడు రోజుల పంచాహ్నిక దీక్షతో నిత్యం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అలంకారాలు భక్తులను కనువిందు చేస్తున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరవరోజు అనగా మంగళవారం ఉదయం శ్రీచండీశ్వరస్వామికి షోడశోపచార క్రతువులు చేశారు. అటుపై దేవస్థానం ఈవో లవన్న ఆధ్వర్యంలో…