RG Kar Medical Hospital: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం- హత్యపై కోల్‌కతాలోని సీల్దాలోని సెషన్స్ కోర్టు ఈరోజు (జనవరి 18) సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌ని దోషిగా తేల్చింది. 160 పేజీల తీర్పులో, కోర్టు అత్యాచారం, హత్య, మరణానికి కారణమయ్యే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ల కింద రాయ్‌ను దోషిగా నిర్ధారించింది.
RG Kar Medical Hospital: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం- హత్యపై కోల్‌కతాలోని సీల్దాలోని సెషన్స్ కోర్టు ఈరోజు (జనవరి 18) తన తీర్పును వెల్లడించనుంది.
Kolkata Rape Case: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌పై జరిగిన దారుణమైన అత్యాచారం- హత్య కేసులో నిందితుడైన సంజయ్ రాయ్ ఉపయోగించిన బైక్ కోల్‌కతా కమీషనర్ ఆఫ్ పోలీస్ పేరుతో రిజిస్టర్ చేయబడిందని తేలింది.
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. ఈ కేసులో నిందితుడు సంజయ్‌రాయ్‌పై సీబీఐ మానసిక విశ్లేషణ (Psychoanalysis Test) నిర్వహించగా అందులో సంచలన విషయాలు బయటపడ్డాయి. నిందితుడు సంజయ్‌ది లైంగికంగా వికృతమైన మనస్తత్వం, జంతువులను పోలిన ప్రవృత్తిని కలిగి ఉన్నాడని తేలింది.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం కేసు వ్యవహారం దేశాన్ని కుదిపిస్తోంది. సభ్య సమాజం తలదించుకునేలా అత్యంత దారుణంగా ఆమె హత్యాచారానికి గురైంది. ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలో వెలడైన విషయాలతో గుండెలు తరుక్కుపోతున్నాయి.