రిషబ్ పంత్, నికోలస్ పురాన్‌లలో లక్నో జట్టు తదుపరి కెప్టెన్‌గా ఎవరు ఉండాలనే దానిపై జట్టు యజమాని సంజీవ్ గోయెంకా తన అభిప్రాయాన్ని తెలిపారు. లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా.. 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌కు కెప్టెన్‌ని మరికొద్ది రోజుల్లో ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జేయింట్స్ ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో.. 165 పరుగులు చేసింది. ఈ క్రమంలో.. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ ఒక్క వికెట్ కోల్పోకుండా విజయం సాధించింది. ఈ క్రమంలో.. లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్ పై విరుచుకుపడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.