UPI: గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధిస్తారనే ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆర్బీఐ కీలక ప్రకటన జారీ చేసింది. యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించే ప్రతిపాదన లేదని రిజ్వర్ బ్యాంగ్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం అన్నారు.
UPI Payments: ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన డిజిటల్ చెల్లింపులు వేగంగా సాగుతున్న వేళ, ఉచిత UPI సేవలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా చేసిన తాజా వ్యాఖ్యలు వినియోగదారుల్లో కలవరం రేపుతున్నాయి. ఇప్పటివరకు ఎలాంటి ఛార్జీలు లేకుండా అందుతున్న UPI సేవలు భవిష్యత్తులో ఉచితంగా ఉండకపోవచ్చని ఆయన సూచించారు. ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా ఈ విషయమై మాట్లాడుతూ.. ఉచిత డిజిటల్ లావాదేవీల యుగం ముగింపు దశకు చేరుకుంటోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం…
దేశంలో కొత్త నోట్లు రాబోతున్నాయి. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో రూ.20 డినామినేషన్ నోట్లను విడుదల చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
బ్యాంకుల పెద్దన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 100, రూ. 200 నోట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కూడిన రూ.100, రూ.200 నోట్లను త్వరలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. కొత్తగా విడుదల చేయనున్న నోట్ల డిజైన్‌లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. ఆర్బీఐ గతంలో జారీ చేసిన రూ.100, రూ.200 నోట్లన్నీ చట్టబద్ధంగా చెలామణిలో కొనసాగుతాయని తెలిపింది. Also Read:Narendra Modi : భోజ్ పురిలో మాట్లాడిన…
REPO Rate: దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తీసుకుంది. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (MPC) ఈ రోజు జరిగిన సమావేశంలో రెపో రటును 25 బేస్ పాయింట్స్ ను తగ్గించింది. ఈ నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. తాజా తగ్గింపుతో రెపోరేటు 6.25%గా నిర్ణయించబడింది. 5 ఏళ్ల తర్వాత ఆర్‌బీఐ రెపోరేటును తగ్గించింది. రెపోరేటు తగ్గింపు ప్రకటన సందర్భంగా గవర్నర్ మల్హోత్రా…
Shaktikanta Das: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ రోజు ( డిసెంబర్ 10) తన పదవి విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ చేశారు.. అందులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)కు సంజయ్ మల్హోత్రా కొత్త గవర్నర్‌గా నియమితులయ్యారు. సంజయ్ మల్హోత్రా భారత ప్రభుత్వ రెవెన్యూ విభాగానికి కార్యదర్శిగా పని చేశారు. కాగా.. సంజయ్ మల్హోత్రాను దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నివేదించారు. శక్తికాంత్ దాస్ లాగానే మల్హోత్రా కూడా IAS అధికారి. అతను 1990 బ్యాచ్ రాజస్థాన్ కేడర్‌కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్.